ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 కోసం బిడ్ల ఆహ్వానం

  • 800 మెగావాట్లతో 3 యూనిట్ల నిర్మాణానికి మార్గం సుగమం

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 కింద చేపట్టనున్న 800 మెగావాట్ల కెపాసిటీతో మూడు యూనిట్ల నిర్మాణానికి ఎన్టీపీసీ గురువారం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం బిడ్లను ఆహ్వానించింది. ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం డిజైన్, ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎరక్షన్, టెస్టింగ్, కమిషనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర పనుల కోసం ఈ టెండర్లను ఆహ్వానించింది. తెలంగాణ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్​1 కింద ఇప్పటికే 800 మెగావాట్లతో రెండు యూనిట్లను నిర్మించగా, స్టేజ్​2 కింద మరో మూడు యూనిట్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది.

మరో రెండు చోట్ల నిర్మాణాలకు బిడ్ల ఆహ్వానం

ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 కింద చేపట్టనున్న 2,400 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణంతో పాటు మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నర్సింగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద గల ఎన్టీపీసీకి చెందిన గదర్వార సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని నబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి సైతం అంతర్జాతీయ స్థాయిలో బిడ్లను ఆహ్వానించారు.

సాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి

ఎన్టీపీసీ తెలంగాణ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2లో చేపట్టనున్న 2,400 మెగావాట్ల విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం చిమ్మీతో పాటు ఇతర నిర్మాణాలకు ఎంపిక చేసిన స్థలాల్లో ఎన్టీపీసీ ఇప్పటికే మట్టి నమూనా టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహించింది. కొత్త ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూసేకరణ అవసరం లేకపోగా, కావాల్సిన పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపై ఎన్టీపీసీ సంస్థ బ్లూ ప్రింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2లో భాగంగా నిర్మించే 2,400 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్చేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే పనిలో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమగ్నమైంది.నిమగ్నమైంది.