సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కానిస్టేబుల్, ఫైర్ పోస్టులకు నోటిఫికేషన్

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. యూనిట్లకు రక్షణ నిమిత్తం సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్హతతో పురుషులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం/ ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు కనీసం 170 సెం.మీ., ఛాతీ 80 నుంచి -85 సెం.మీ. ఉండాలి. జీతం నెలకు రూ.21,700- నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్,  డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఓఎమ్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25 ప్రశ్నలు-– 25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ (25 ప్రశ్నలు-– 25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు–- 25 మార్కులు), ఇంగ్లీష్/ హిందీ (25 ప్రశ్నలు-– 25 మార్కులు). ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ హిందీ మీడియంలో క్వశ్చన్​ పేపర్​ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.cisfrectt.cisf.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.