ఇయర్ హుక్ డిజైన్తో.. నథింగ్ ఇయర్ బడ్స్ లాంచ్.. సూపర్బ్గా ఉన్నాయి

బ్రిటిష్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ Nothing దాని కొత్త ఓపెన్ ఇయర్ స్టైల్ వైర్లెస్ ఇయర్ బడ్ Nothing Ear (Open)లను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఇలాంటి ఇయర్ బడ్ ఏ కంపెనీ లాంచ్ చేయలేదు. ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకత ఏంటంటే.. సౌండ్ సీల్ సిస్టమ్.ఇది ఆడియో లీకేజీని తగ్గించే డైరెక్షనల్ స్పీకర్లతో కలిసి పనిచేస్తుంది. ఈ ఇయర్ బడ్స్  చెవినుంచి జారి పోకుండా ప్రత్యేకమైన ఇయర్ హుక్ డిజైన్ తో వస్తున్నాయి. 

ఈ ఇయర్ బడ్స్ లోపల నికెల్ టైటానియం వైర్ తో సిలికాన్ ఇయర్ హుక్ ఉంటుంది. ఇది చాలా మన్నికను అందిస్తుంది. ప్రతి బడ్ కు 8.1 గ్రాముల బరువుతో చెవి- (ఓపెన్) మూడు పాయింట్ల మద్య సమతుల్యం చేసుకునేలా రూపొందించబడింది. ఇది చెవులకు పెట్టుకున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది. 

Also Read :-  హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటా

Nothing Ear (Open) ఇయర్ బడ్స్ సౌండ్ లీకేజీని తగ్గించే సౌండ్ సీల్ సిస్టమ్ తో పాటు 50 డిగ్రీల వద్ద వంటి ఇయర్ బడ్ లు వంగి ఉంటాయి. దీంతో స్పీకర్లను నేరుగా ధరించిన చెవిపై ఉంచుతుంది.14.2 మి.మీ డైనమిక్ ఆడియో డ్రైవర్ తో పనిచేస్తుంది. ఇది మిడ్ , హై ఫ్రీక్వెన్సీలను 3 DB వరకు పెంచేలా తేలికపాటి భాగాలతో తయారు చేయబడింది.  మొత్తానికి ఇది ధరించిన కస్టమర్ కు మంచి సౌకర్యంగా ఉంటుంది.  

Nothing Ear Buds (Open) ధర రూ. 17వేల 999 మాత్రమే. ఇది వైట్ కలర్లతో అందుబాటులో ఉంది.