పిట్లం, వెలుగు : కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న బ్రిడ్జి మూడేళ్ల క్రితం వరదలకు కొట్టుకు పోతే ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. దీంతో ఇరు ప్రాంతాల ప్రజలు నాయకులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల మధ్య సరిహద్దు నల్లవాగు పై ఉన్న బ్రిడ్జి మూడేళ్ల కిందట వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయింది.
రెండు ప్రాంతాల ప్రజలకు కీలకమైన రోడ్డు మూసుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజల ఆందోళనలు చేయడంతో రెండు సంవత్సరాల క్రితం రూ. ఐదు కోట్లు మంజూరయ్యాయి. నెల రోజుల క్రితం పనులు పూర్తి చేసినా నిధులు విడుల చేయకపోవడంతో కాంట్రాక్టర్ బ్రిడ్జిని అనుసంధానించే రోడ్డు పనులు నిలిపి వేశాడు. ప్రస్తుతం తాత్కాలిక రోడ్డునుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి.