ఇండియాలో 5G సొల్యూషన్‌ కోసం : చేతులు కలపనున్న ఎయిర్‌టెల్, నోకియా!

శరవేగంగా పెరుగుతున్న టెక్నాలజీతోపాటు IT కంపెనీలు కూడా వారి మార్కెట్ పెంచుకోవడం కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో 5జీ టెలికాం పరికరాలు సప్లై చేయడానికి నోకియా భారతి ఎయిర్‌టెల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇండియాలో ఆపరేటర్ నెట్‌వర్క్ విస్తరణకు మద్దతుగా 5G డివైజ్ లను తయారు చేయడానికి ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. లెటెస్ట్ 5G సొల్యూషన్స్ అందించడానికి నోకియా, ఎరిక్సన్ మరియు సామ్‌సంగ్ వంటి కంపెనీలు మార్కెట్‌లో చాలా పోటీ పడుతున్నాయి.  

ALSO READ | టెలిగ్రాం యూజర్ల కొంప మునిగింది.. మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా..?

5G సర్వీస్‌ల కోసం ఎయిర్‌టెల్‌తో నోకియా బిలియన్స్ డాలర్ల ఒప్పందాన్ని చర్చిస్తున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌టెల్ ఇండియా అంతటా అంతటా దాని నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది కాబట్టి. ఇప్పుడు ఈ ఒప్పందం కీలకం చాలా. నోకియా ఆధునికి ఎయిర్‌స్కేల్ మొబైల్ రేడియోలు ఉంటాయి. ఇది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌లను 5G-అడ్వాన్స్‌డ్‌కి ఈజీగా అప్‌గ్రేడ్ చేయగలదు నోకియా.