సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసంతో హైటెన్షన్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్ పర్సన్ పై నిన్న(జనవరి 28) అవిశ్వాస తీర్మానం వీగి పోవడానికి కారణమైన.. 45 వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ అసమ్మతి, కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు. ఇంట్లో దుమ్మెత్తిపోసి, కోడిగుడ్లను విసిరేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 

అవిశ్వాసం నోటీస్ పై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అమ్ముడు పోయాడని మండిపడ్డారు అసమ్మతి కౌన్సిలర్లు.