బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు.. షేక్ హసీనాను అప్పగించాలని భారత్కు లేఖ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ కు లేఖ రాసింది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం. షేక్ హసీనాను విచారణలో భాగంగా తమకు అప్పగించాలని లేఖలో పేర్కొంది. బంగ్లా హై కమిషన్ నుంచి లేఖ అందిందని, ప్రస్తుతం దీని గురించి ఏం మాట్లాడదలచుకోలేదని భారత దౌత్య అధికారులు అన్నారు. 

ఆదివారం ఢాకాలో బంగ్లా విదేశాంగ మంత్రి  తౌహిద్ హొస్సేన్ మాట్లాడుతూ విచారణలో భాగంగా హసీనాను అప్పగించాలని భారత్ కు లేఖ రాసినట్లు తెలిపారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలని ఆయన అన్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించలేదు. 
2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లా వదిలి భారత్ కు ఆశ్రయం కోసం వచ్చింది. బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రజా ఉద్యమం వెల్లువెత్తడంతో ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. 

ALSO READ | మనోళ్లు ఎక్కడా తగ్గట్లే.. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఛాన్స్ కొట్టేసిన భారతీయుడు

అయితే బంగ్లాలో ఇప్పటికీ హిందువులు, మైనారిటీలపై ఇప్పటికీ దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా దేశం వదిలిన నాటి నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మైనారిటీలపై జరిగిన దాడులపై 2200 కేసులు నమోదైనట్లు ఇస్కాన్ వైస్ ప్రసిడెంట్ రాధారామన్ దాస్ తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లోనే మూడు ఆలయాలపై దాడులు జరిగినట్లు తెలిపారు. ఇక క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలంటే భయంగా ఉందని క్రిస్టియన్ ప్రతినిధులు తెలిపారు.