టీవీల్లో బర్గర్, కూల్ డ్రింక్ యాడ్స్ నిషేధం : సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశం.. కారణం ఇదే.. !

యూకే ప్రభుత్వం టీవీల్లో కూల్ డ్రింగ్స్, ఫిజ్జా, బర్గర్ల యాడ్ లను బంద్ చేసింది. బ్రేవరేజెస్ ఫుడ్స్ యాడ్ లపై నిషేధం విధిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఉదయం వేళల్లో ఈ ఫుడ్స్ కు సంబంధించిన యాడ్స్ అస్సలు ప్రసారం చేయకూడదు.. కొత్త నిబంధనల ప్రకారం.. అనారోగ్యకరమైన ఫుడ్స్, డ్రింక్స్ కు సంబంధిం చిన యాడ్స్ ను రాత్రి 9 గంటల తర్వాతే ప్రసారం చేయాలి.. ఇంతకీ యూకే ప్రభుత్వం ఎందుకు నిబంధనలు తెచ్చిందో తెలుసుకుందాం.. 

Also Read:-పిల్లలు రోజూ క్యారెట్ తినొచ్చా..

సాల్ట్ ఫుడ్స్, షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న బేవరేజెస్ ఫుడ్స్ లను నియంత్రించే లక్ష్యంతో అలాంటి ఫుడ్స్ సంబంధించిన యాడ్స్ను యూకే ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే ఫాస్ట్ ఫుడ్ అడ్వర్ టైజ్ మెంట్లకు ఇది వర్తించదు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లనుంచి ఫిజ్జాలు, బర్గర్లు లేదా ఫ్రైస్ వంటి కొన్ని రకాల ఫుడ్స్ కు సంబంధిం చినవి కాకుండా మిగతా వాటికి సంబంధించిన యాడ్ లను ప్రసారం చేయొచ్చు. 

ఎందుకు ఈ యాడ్స్ బ్యాన్ చేశారంటే.. 

పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతోంది. ఇది భవిష్యత్తు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది..పిల్లలు ఈ జంక్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. కాబట్టి వీటిపై నియంత్రణ ఉంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. టీవీ , ఆన్ లైన్ లో పిల్లల జంక్ ఫుడ్ ప్రకటనలను బ్యాన్ చేయాలని నిర్ణయించాలని యూకే హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ చెబుతున్నారు.