జనాలకు పిచ్చి ముదిరింది... రోకలి తలకు చుట్టండి అన్నాడంట ఓ పెద్దాయన.. ఈ రోజుల్లో అయిన దానికి.. కాని దానికి జనాలు రోడ్డుపైకి రావడం.. కర్రకు ఓ అట్టముక్క తగిలించి.. దానిపై ఏదేదో రాసి.. అదేనండి ప్లకార్డ్‌తో ఓ నలుగురిని పోగేసుకొని అరుస్తూ ర్యాలీ పేరుతో తిరగడం ప్యాషన్ అయింది. ఇప్పుడు ఇండోర్ కాలేజి గర్ల్స్ చేసిన ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆశక్తికరంగా మారింది.. వివరాల్లోకి వెళ్తే...
సోషల్ మీడియా రాజ్యమేలుతున్న హైటెక్ యుగంలో .. జనాల ఆలోచలకు తగ్గుట్టుగా ప్యాషన్ యుగం నడుస్తుంది. అమ్మాయిలు లిఫ్స్టిక్.. ఫేస్ క్రీమ్ లతో బ్యూటీగా కనపడుతుంటే.. అబ్బాయిలు మాత్రం కొంతమంది గడ్డం పెంచి.. మరికొందరూ గడ్డాన్ని ట్రిమ్ చేసి అందంగా కనపడుతుంటారు. ఇంకొంతమంది క్లీన్ షేవ్ చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారుంటారు. తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం `గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి`` అంటూ వీధుల్లో ర్యాలీచేశారు.
Clean shave ke liye ladkiyon ne kiya kalesh? pic.twitter.com/QkmIROdDyk
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024
కృత్రిమ గడ్డంతో ఇండోర్ లోని కాలేజీ గర్ల్స్ వినూత్న ర్యాలీ చేశారు. అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా .. .నో క్లీన్ షేవ్.. నో లవ్,గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి గడ్డాన్ని అయినా వదులుకో లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను అయినా వదులుకో అంటూ...నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఆ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు.ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు (వార్త రాసే సమయం వరకు) 8 లక్షల మందికి పైగా వీక్షించగా.. . 4.4 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.
ALSO READ | శిక్షిస్తే ఆగవు..బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలి: సుప్రీంకోర్టు
ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. .మా గడ్డం.. మా ఇష్టం, మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏంటి, అని అబ్బాయిలు కామెంట్లు పెడుతున్నారు. అబ్బాయిల గడ్డంతో అమ్మాయిలకు ఏమైనా పనా? అంటున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లు కొంతమంది .. నేను అర్జంటుగా ఇండోర్ వెళ్లాలి అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు. గడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండంటూ ఇండోర్ కాలేజ్ అమ్మాయిల వింత నిరసన మరి మునుముందు ఏ ట్రెండ్ సృష్టిస్తుందో చూడాలి.