కేంద్ర మంత్రులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శుభాకాంక్షలు

నిజామాబాద్, సిటీ వెలుగు: ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి, అంచెలంచెలుగా ఎదిగి, బీజేపీని ప్రజలకు దగ్గర చేసి, ప్రజల మన్ననలు పొందిన మోదీ మూడో సారి ప్రధాని కావడం దేశానికి గర్వకారణం అన్నారు. 

బీజేపీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఉన్నత స్థానం దక్కుతుందని చెప్పడానికి ప్రధాని మోదీ, బండి సంజయ్​, కిషన్​ రెడ్డి   సాక్ష్యమని తెలిపారు. రాష్ట్రం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు రావడం గొప్ప విషయం అని చెప్పారు.