నిజామాబాద్​లో మరో రెండు కోర్టులు ప్రారంభం

నిజామాబాద్, వెలుగు : జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో అదనంగా మరో రెండు కొత్త కోర్టులను శనివారం హైకోర్టు జడ్జి ఎన్.తుకారం ప్రారంభించారు. అడిషనల్​ సివిల్​కోర్టుతో పాటు ఐదో అడిషనల్​ జూనియర్​ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హన్మంతు, అడిషనల్​కలెక్టర్​ కిరణ్​ కుమార్, అడిషనల్​డీసీపీ జయరాం పాల్గొన్నారు.