కలిసికట్టుగా అభివృద్ధికి కృషి చేద్దాం : ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • దిశ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

జగిత్యాల టౌన్, వెలుగు : ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని దిశ చైర్మన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అన్నారు. గురువారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. కలెక్టర్ సత్య ప్రసాద్, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు లత, గౌతమ్ రెడ్డిలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ శాఖలకు వచ్చే నిధులు, ఇతర అంశాలపై రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు అన్ని రివ్యూ చేసి త్వరలో దిశ కమిటీ వేసి సభ్యులను నామినేట్ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం మారిందని, ఎమ్మెల్యే  గతంలో సమావేశాలకు హాజరు అయ్యేవారు కాదని ఇప్పుడూ రావడం సంతోషకరమని అన్నారు. త్వరలోనే జగిత్యాల, నిజామాబాద్ పట్టణాలను స్మార్ట్ సిటీ చేయబోతున్నామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు.

 కోమిరెడ్డి జ్యోతక్క మృతి బాధాకరం

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క మృతి బాధాకరమని, నియోజకవర్గ ప్రజలకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జ్యోతక్క కుమారులు కరంచంద్, విజయ్ ఆజాద్, కపిల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.