రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్‌కు స్పష్టత ఉంది : జీవన్ రెడ్డి

బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్‌ రిజర్వేషన్ల పట్ల స్పష్టత తో ముందుకు వెళుతుందని ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం వేల్పూర్ మండలంలోని లక్కోరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రణాళిక ఉందన్నారు. 

బీజేపీ పెట్టుబడిదారుల వ్యాపారులకు లక్షల కోట్లు బకాయిలు రద్దు చేస్తోందని ఆరోపించారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించలేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఏడాదిలోనే 20 లక్షల ఉద్యోగాల భర్తీ కి రూపకల్పన చేస్తామని ప్రకటించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు  ముత్యాల సునీల్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, మానాల మోహన్ రెడ్డి, పొద్దుటూరి వినయ్ రెడ్డి పాల్గొన్నారు.