Nissan Magnite Discount: నిస్సాన్ మాగ్నెట్ కొత్త మోడల్ కారు విడుదల.. ధర ఫీచర్లు ఇవే

నిస్సాన్ ఇండియా..తన కొత్త మోడల్ నిస్సాన్ మాగ్నైట్ కారును విడుదల చేసింది. నిస్సాన్ మాగ్నైట్ మిడ్ లైఫ్ ఫేస్ లిఫ్ట్ ను శుక్రవారం ( అక్టోబర్ 4) న లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.5.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ మోడల్ లో టాప్ స్పెసిఫికేషన్లు ఉన్న వేరియంట్ల ధర రూ.11.50 లక్షలు ( ఎక్స్ షోరూమ్ ధర)గా ఉంది. అయితే మొదటి 10వేల డెలివరీలకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఈ కొత్త మోడల్ కారు ఇంజన్లు.. స్పెసిఫీకేషన్ల పరంగా ఒకే విధంగా ఉన్నప్పటికీ సబ్ కాంపాక్ట్ SUV ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ డిజైన్ లో భారీ మార్పులతో వస్తున్నాయి. 

నిస్సాన్ మాగ్నైట్ వివిధ వేరియంట్ల ధరలు 

  • నిస్సాన్ మాగ్నైట్ VISIA ధర రూ. 5,99,400
  • నిస్సాన్ మాగ్నైట్ VISIA + ధర రూ. 6,49,400
  • నిస్సాన్ మాగ్నైట్ ACENTA  ధర రూ. 7,14,000
  • నిస్సాన్ మాగ్నైట్ N - CONNECTA ధర రూ. 7,86,000
  • నిస్సాన్ మాగ్నైట్ TEKNA ధర రూ. 8,75,000
  • నిస్సాన్ మాగ్నైట్ TEKNA+ ధర రూ. 9,10,000

నిస్సాన్ మాగ్నైట్ స్పెసిఫికేషన్లు.. 

నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్ కార్లలో ఫ్రంట్ ఎండ్ లో మందపాటి క్రోమ్ బార్డర్, గ్లోస్ బ్లాక్ ఇన్ సర్ట్ లతో పెద్ద బోల్డ్ గ్రిల్ ఉంటుంది. ఇంతకు ముందు మోడల్ లో ఉన్న L షేప్ DRL లలో మార్పు లేకుండా ఉంచారు. ఈ మోడల్ లో కొత్తగా ఇంటిగ్రేడ్  ఫాగ్ ల్యాంప్స్ తో పాటు ఫ్రంట్ బంపర్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 50 కిలోల బరువును మోయగల ఫంక్షనల్ రూఫ్ రెయిల్ జోడించారు. వెనక భాగంలో LED టెయిల్ లైట్లతో లేటెస్ట్ మోడల్ ఆకట్టుకుుంటోంది. 

ఇక కారు లోపలి భాగంలో డిజైన్ గురించి మాట్లాడితే.. నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్ లో ఆల్ లెథెరెట్ ఆప్ హోల్ స్టరీ తోపాటు సెగ్మెంట్ 360 లెదర్ ప్యాక్ లో బెస్ట్ వన్ గా ఉంది. లేఅవుట్ పాత మోడల్ లాగే ఉంటుంది. బూట్ స్పేస్ తో పెంచడం ద్వారా క్యాబిన్ స్టోరేజ్ అద్భుతంగా ఉంది. 

ఇక ఫీచర్లు గురించి అయితే.. నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్ లో 20కి పైగా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్లాస్మా క్లస్టర్ ఎయిర్ ఐయోనైజర్, గ్లోబల్ స్మార్ట్ కీ, బెజెల్ లెస్ ఆటో డిమ్మింగ్ IRVM , పూర్తి LED ఎక్స్ టర్నల్ ప్యాక్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 

ఈ SUVలో 7అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు వైర్ లెస్ Apple Car Play, 8అంగుళాల టచ్ స్క్రీన్  ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా ఉంది. నిస్సాన్ వైర్ లెస్ ఛార్జర్, డ్యాష్ వ్యామ్, JBL స్పీకర్లు, LED స్కఫ్ ప్లేట్లు, పుడ్ల్ ల్యాంపులతో టెక్ ప్యాక్ ఉంటుంది. 

నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిలో1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపిక కూడా ఉంది. 100BHP పవర్, 160nAm టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిషన్ తో వస్తుంది. 

ఈ కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ ను  చెన్నైలోని అలయన్స్ ప్లాంట్ లో తయారు చేశారు. కొత్త నిస్సాన్ మోడల్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకీ బ్రెజ్జా, రెనాల్ట్ కిగర్ వంటి కార్లకు నిస్సాన్ మాగ్నైట్ గట్టి పోటీదారుగా ఉంది.