ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట వేయాలి : అభిలాష అభినవ్

  • కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్  వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్​లో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నమోదైన ప్రసూతి మరణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తూ రక్తహీనత, పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన వారికి ఐరన్, క్యాల్షియం మాత్రలు అందించాలన్నారు. పోషకాహారం, మానసిక ఆరోగ్యం పట్ల గర్భిణులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. హై రిస్క్ కేసులున్న గర్భిణులను గుర్తించి అవసరమైన చికిత్స అందించాలన్నారు. 

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యాధికారులు సురేశ్, సౌమ్య, డాక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.