Committee Kurrollu Trailer: కమిటీ కుర్రోళ్ళ ట్రైలర్ జాతర..మెగా డాటర్ నిహారిక హిట్ కొట్టేలా ఉందే!

మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా కమిటీ కుర్రాళ్లు (CommitteeKurrollu).క‌మిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా ప‌ద‌కొండు మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్ల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తోంది నిహారిక.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అమ్మవారి జాతర సీన్ తో ట్రైలర్ షురూ అయింది. ఊరు ఊరంతా అమ్మవారిని కొలుస్తున్నట్లు చూపించగా..ఆ తర్వాత విద్యార్థులంతా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇక ఆ వెంటనే ఊర్లో గొడవలు చూపిస్తున్న సీన్ లో సాయి కుమార్ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఓసీ క్యాటగిరీ విద్యార్థికి మంచి ర్యాంక్ రాకపోవడంతో బాధపడతాడు. ఆ తర్వాత చిన్నగొడవ కాస్త పెద్ద గొడవకు దారితీస్తుంది. రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ముఖ్య అంశంగా నిలుస్తుంది. మరి చివరకు ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ఎలక్షన్స్ టార్గెట్ చేసుకుని వచ్చిన సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ కమిటీ కుర్రాళ్లు మూవీ ఆగష్టు 9న థియేటర్లలోరిలీజ్ కానుంది.

ALSO READ | Purushothamudu Review: పురుషోత్తముడు మూవీ రివ్యూ.. రాజ్‌తరుణ్‌ సినిమా ఎలా ఉందంటే?

ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోల విషయానికి వస్తే..ప్రసాద్ బెహరా,ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, అక్షయ్ శ్రీనివాస్, శివకుమార్ మట్ట మిగిలిన హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.