హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం చాలా సులభం. కానీ వాటి క్లెయిమ్ చేసుకునేటప్పుడే అసలు సమస్య. చాలా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. దీంతో హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ల్యాబ్ లు, రోగులకు క్లెయిమ్ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మెడిక్లెయిమ్ లను సులభ తరం చేసుందుకు కేంద్రం ఆరోగ్య శాఖ..నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్చేంజ్(NHCX) తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
హెల్త్ క్లెయిమ్ ఫిల్లింగ్ ప్రాసెస్ ను సులభతరం చేసేందుకు ఆరోగ్యశాఖ NHCXను ఏర్పాటు చేసింది. ఇది ఆస్పత్రులకు పేమేంట్, సర్వీసులను అందించే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలులకు సింగిల్ ప్లాట్ ఫాం గా పనిచేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇది సింగిల్ విండోగా పనిచేస్తుంది.
నేషనల్ హెల్త్ అథారిటీ(NHA), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(IRDAI) లు సంయుక్తంగా NHCX ను అభివృద్ధి చేశారు. ఇది మొత్తం భారతదేశంలోని ఇన్సూరెన్స్ వ్యవస్థను నియంత్రించనుంది.
ముఖ్యంగా ఇది ఆయుష్మాన్ భారత్ పీఎ జన్ యోజన పథకాన్ని అమలు చేయడంలో బాధ్యత వహిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి సంవత్సరం ఒక ఫ్యామిలీకి కేంద్ర ప్రభుత్వం రూ. 5లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.
ఈ ఫ్లాట్ ఫాం ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ను ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగవంతంగా జరిగేందుకు సహాయ పడుతుంది. దీనికి 40నుంచి 50 ఇన్సూరెన్స్ కంపెనీలు, 250 హాస్పిటల్స్ ఈ NHCX లో విలీనం కానున్నాయి.
అన్ని సెటిల్‌మెంట్‌లకు ఒకే గేట్‌వే
చెల్లింపుదారు (ఇన్సూరెన్స్ కంపెనీ/TPA/Govt స్కీమ్ అడ్మినిస్ట్రేటర్) , ప్రొవైడర్ (హాస్పిటల్/ల్యాబ్/పాలీక్లినిక్) మధ్య డేటా, డాక్యుమెంట్లు పంచుకోవడం ద్వారా హెల్త్ క్లెయిమ్ లను సులభతరం చేయడమే NHCX లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్స్ (APIలు) ఉపయోగించి ఒకే గేట్‌వే ద్వారా FHIR కంప్లైంట్‌తో డేటా మార్పిడితో సమర్థవంతమైన క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కార్యాచరణ ఖర్చులను తగ్గించునుంది.