టీఎస్ఎండీసీ , ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లకు ఎన్జీటీ షాక్

తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (టీఎస్ఎండీసీ), ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లకు ఎన్జీటీ షాక్ ఇచ్చింది.  చెరో  రూ.25 కోట్ల ఫైన్ వేస్తూ ఎన్జీటీ  తీర్పు ఇచ్చింది.  పర్యావరణ అనుమతులు లేకుండా మానేరు వాగులో ఇసుక అక్రమంగా తీయడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టుముక్కల సురేష్ రెడ్డి ఎన్జీటీలో సవాల్ చేశారు. 

సురేష్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన ఎన్జీటీ ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.  చెరో రూ. 25 కోట్లను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మూడు నెలల్లో కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  రూల్స్ పాటించేలా జిల్లా కలెక్టర్ కు సంబంధిత అధికారులకు సర్కులర్ చేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఎన్జీటీ ఆదేశించింది.  

ఎన్జీటీ తీర్పుపై  గొట్టుముక్కల సురేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  టీఎస్ఎండీసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్,  డిస్టిక్ సాండ్ కమిటీకి తప్పుడు నివేదికలు ఇచ్చి అక్రమంగా ఇసుక తీశారన్నారు.  అప్పటి పాలక పక్షానికి,  ప్రతిపక్షాలకు కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని మండిపడ్డారు.  ఆ నిధులను జీఆర్ఎంబీకి ఇచ్చి గోదావరి పరివాహక పరివాహక ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని ఎన్జీటీ ఆదేశించడం స్వాగతిస్తున్నామని వెల్లడించారు.