SL vs NZ 2024: గాలే టెస్ట్.. ఒకే రోజు రెండు సార్లు ఔటైన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్స్

గాలే వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఒకే రోజు ఏకంగా 13 వికెట్లు నేలకూలాయి. లంక స్పిన్నర్లు చెలరేగడంతో కివీస్ సమాధానమే లేకుండా పోయింది. ప్రభాత్ జయసూర్య, అరంగేట్ర బౌలర్ నిషాన్ పీరిస్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను కేవలం 88 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
 
మూడో రోజు ఆటలో భాగంగా విలియంసన్, రచీన్ రవీంద్ర, డారిల్ మిచెల్ రెండు సార్లు ఔటయ్యారు. 2 వికెట్లకు 22 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి సెషన్ లోనే విలియంసన్, రచీన్ రవీంద్ర, డారిల్ మిచెల్ ఔటయ్యారు. ఫాలో ఆన్ ఆడుతూ మరోసారి వీరు ముగ్గురు మూడో రోజు మరోసారి పెవిలియన్ బాట పట్టారు. దీంతో స్టార్ ప్లేయర్లయిన వీరు ముగ్గురు ఒకే రోజు రెండు సార్లు ఔట్ కావడం మూడో రోజు ఆటలో హైలెట్ గా మారింది. 

ALSO READ | IND vs BAN 2024: కాన్పూర్ టెస్ట్‌కు వింత సమస్య.. కాపలాగా కొండముచ్చులు

2 వికెట్ల నష్టానికి 22 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్ దెబ్బకు జట్టు ఏ దశలోనూ కోలుకుపోలేకపోయింది. కేవలం 88 పరుగులకే కుప్పకూలడంతో ఆతిధ్య జట్టు లంకకు 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు 6 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర బౌలర్ నిషాన్ పీరిస్ కు మూడు వికెట్లు దక్కాయి. అసిత ఫెర్నాండోకు ఒక వికెట్ లభించింది. 

ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్రీజ్ లో బ్లండర్ (47), ఫిలిప్స్ (32) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 315 పరుగులు వెనకబడి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ లో లంక విజయం లాంఛనంగా కనిపిస్తుంది.