IND vs NZ 2nd Test: డేంజర్ జోన్‌లో భారత్.. 300 పరుగులు దాటిన న్యూజిలాండ్ ఆధిక్యం

పూణే టెస్టులో రెండో రోజంతా న్యూజిలాండ్ ఆధిపత్యం చూపించింది. భారత్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి రెండో టెస్ట్ లో పట్టు బిగించింది. మొదట భారత్ ను త్వరగా ఆలౌట్ చేసిన కివీస్.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్రీజ్ లో బ్లండల్ (30) ఫిలిప్స్ (9) ఉన్నారు. కెప్టెన్ టామ్ లేతమ్ 86 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం న్యూజిలాండ్  రెండో ఇన్నింగ్స్ లో 301 పరుగుల ఆధిక్యంలో ఉంది.    

రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులతో మూడో సెషన్ ను ప్రారంభించిన న్యూజిలాండ్.. మరో 113 పరుగులు జోడించి 5 వికెట్లను కోల్పోయింది. రచీన్ రవీంద్ర (9), మిచెల్ (18) ను సుందర్ త్వరగా ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ సమయంలో కెప్టెన్ లాతమ్ తో కలిసి వికెట్ కీపర్ బ్లండెల్ (30*) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 60 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆట చివర్లో సుందర్ మరోసారి తమ మ్యాజిక్ డెలివరీతో క్రీజ్ లో కుదురుకున్న లాతమ్ ను ఔట్ చేసి టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు.    

ALSO READ | IND vs NZ 2nd Test: ప్రాక్టీస్ సరిపోదు.. కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే: భారత స్పిన్ దిగ్గజం

బ్లండెల్, ఫిలిప్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత బౌలర్లలో సుందర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ కు ఒక వికెట్ లభించింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ కు 7 వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ రెండు వికెట్లు దక్కగా.. సౌథీ ఒక వికెట్ తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది.