రాజన్న ఆలయంలో న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందడి..భారీగా తరలివచ్చిన భక్తులు 

వేములవాడ, వెలుగు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం న్యూ ఇయర్​సందడి నెలకొంది. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. వరంగల్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్రస్నానం ఆచరించారు. తడిబట్టలతోనే స్వామిని దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీరాలని రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.  

వేములవాడ, కొండగట్టులో ప్రముఖుల పూజలు

వేములవాడ/కొండగట్టు, వెలుగు: న్యూ ఇయర్​ కావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో, కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రముఖులు పూజలు చేశారు. వేములవాడలో ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీ అఖిల్​మహాజన్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనంతరం ఆలయ అద్దాల మంటపంలో అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. ఈవో వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్వతీ- పరమేశ్వరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని రాజన్నను వేడుకున్నట్లు చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి రూ.127కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కొండగట్టులో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.