కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్ వెల్​కమ్

 కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పింది. తొలుత న్యూజిలాండ్​లోని చాతమ్ ఐలాండ్​లో సంబురాలు మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:45 నిమిషాలకే ఇక్కడ జనవరి 1 వచ్చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ (మెయిన్ ల్యాండ్), ఆస్ట్రేలియాలలో జనం వేడుకలు జరుపుకున్నారు. భారత దేశంలోని వివిధ నగరాలలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రత్యేక ఈవెంట్లు, కేక్ కటింగ్, బాణసంచా కాల్చుతూ జనం సంబురాలు జరుపుకున్నారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.