New year 2025 : కొత్త ఏడాది పార్టీలకు వెళుతున్నారా.. ఇట్ల తయారవ్వొచ్చు.. పార్టీకి తగ్గట్టు ఇలా డ్రెస్ వేసుకోండి..!

ఫ్యాషన్ పార్టీ ఏదైనా స్టైలిష్ గా కనిపించాలనే కోరుకుంటారంతా. జీన్స్ వేసుకున్నా..లాంగ్ ఫ్రాక్ను ఇష్టపడ్డా.. అందుకు తగ్గట్టు స్టైల్ను ఫాలో అయితేనే క్రేజ్. ఈ న్యూ ఇయర్ పార్టీకి మీరు స్టైల్గా కనిపిస్తున్నారు కదా!!

స్టైలింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంజాయ్ చేయడం కష్టం. కానీ పార్టీలో హైలెట్ అవ్వాలి కాబట్టి స్టైలిష్ గానూ కనబడాలి. మేకప్ దగ్గర్నుంచి హెయిర్, డ్రెస్సింగ్, ఫుట్ వేర్ విభిన్నంగా ఉంటేనే పార్టీ హైలైట్ అవుతారు.

డ్రెస్ కు  తగ్గట్టే...

మేకప్ వేసుకుంటే అది డ్రెస్ కి తగ్గట్టుగా ఉండాలి. లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే మేకప్ కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. అదే డార్క్ కలర్ డ్రెస్ అయితే మేకప్ టైట్ గా ఉండాలి. కొంతమంది ఎప్పుడూ మేక ప్లోనే కనబడతారు. వారికి ఏ మేకప్ అయినా నప్పుతుంది. కానీ అప్పుడప్పుడే వేసుకునే వారు కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే, వెళ్లే ప్రదేశాన్ని బట్టి కూడా మేకప్ వేసుకుంటే మంచిది. 

గుడికి వెళితే

కొత్త సంవత్సరం రోజు తెల్లవారుజామున గుడికి వెళ్తుంటారు. చాలామంది. సంప్రదాయ దుస్తులు వేసుకుంటే, లైట్ మేకప్ఉంటేనే బెటర్. స్కిన్ కలర్ పౌడర్ అయితే మంచిది. బ్రైట్ కలర్ ఐ షేడ్ వేసుకుని, ఐ లైనర్ పెట్టుకోవాలి. అలాగే టైట్ షాడో లిస్టిక్ వేసుకోవాలి. మేకప్ మీరు ధరించిన డ్రెస్ కి సూటయ్యేలా ఉండాలి.

అబ్బాయిలూ.... ఇది మీకే!

న్యూ ఇయర్ పార్టీ హంగామా అంతా మీ డ్రెస్లోనే కనిపించాలంటే బోరింగ్ ప్యాంట్లు.. టీ షర్టులు... పెరిగిపోయిన గడ్డం... చెదరిపోయే క్రాఫ్ కాకుండా ట్రెండీగా రెడీ అయితే అందరి లుక్కూ మీ మీదే ఉంటుంది.

Also Read : కొత్త ఏడాదిలో కొత్తగా ఆలోచించండి.. ఆరోగ్యంగా ఉండండి..!

పార్టీ అంటే పార్టీనే!

పార్టీల కెళ్లేప్పుడు హైలైట్ గా కనిపిం చడానికి మామూలు రోజుల్లో కంటే ఎక్కువ మేకప్ చేసుకోవచ్చు. ముఖానికి ఫౌండేషన్ క్రీం పెట్టి, పౌడర్ టైట్ గా పూయాలి. ఐ షేడ్స్, లిప్స్టిక్ డార్క్ గా ఉండేలా చూసుకోండి. ట్రేస్కి తగ్గట్టుగా సాండిల్స్ ఉండాలి. లేదంటే దాని లుక్ మారిపోతుంది. జీన్స్ అయితే హేల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. గాగ్రా, లాంగ్ ఫ్రాక్స్ అయితే హీల్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. లేదంటే వాటి కింద పడి ఇబ్బంది పడతారు. డిఫరెంట్ షూస్ వేసుకోవచ్చు. ఫ్లాట్ చెప్పులు అయితే ఇంకా బెటర్. వీట న్నింటినీ మించి పండు.. పార్టీయైనా ముఖంమీద చిరునవ్వు మాత్రం చెరిగిపో నివ్వకండి. అదే అన్నింటికంటే హైలెట్.

బాయ్స్ కు వేరే కిట్స్

అబ్బాయిలకు ప్రత్యేకంగా మేకప్ కిట్స్ ఉన్నాయి. మామూలప్పుడు అంతగా పట్టించుకోక పోయినా పండగ రోజైనా శ్రద్ధ పెడితే పార్టీల్లో మీరే హైలెట్ అవుతారు. ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుంది. కంటి చుట్టూ ఉండే నలుపు పోయేలా ఫౌండేషన్ క్రీం అప్లై చేసుకోవచ్చు. జుట్టుకి కటింగ్ చేయించుకోవాలి. ముఖానికి నప్పే హెయిర్ స్టైల్ చేసుకోండి. పార్టీ అని కొత్త స్టైల్ ట్రై చేయకపోవడమే మంచిది. జుట్టు ఎక్కువగా చెదరిపోయే వాళ్లు తలకి కొంచెం హెయిర్ క్రీం పెట్టి దువ్వుకుంటే స్టైల్ చెదిరిపోకుండా ఉంటుంది. కొంతమందికి గడ్డం అందాన్నిస్తుంది. మరికొంత మందికి నప్పదు. అలాంటివారు పార్టీలకు వెళ్లేటప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

ఆఫీసుకి వేసుకెళ్లే ఫార్మల్స్, ఏకెండ్స్లో వేసుకునే జీన్స్, టీ షర్టులు కాకుండా పార్టీలకు వెరైటీగా డ్రెస్లు రెడీ చేసుకుంటే హైలైట్ అవుతారు. వాటిని పార్టీలకు, స్పెషల్ డేలకు ధరిస్తే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తారు. ఈవెంట్ ను బట్టి పైజమా, కుర్తా, లాంగ్ వర్క్స్ ట్రేజర్ మోడల్ షర్ట్స్, జాకెట్స్ ఇలాంటివి ట్రై చేయొచ్చు. మేకప్ మొత్తం పూర్తయ్యాక కొద్దిగా పరప్యూమ్ స్ప్రే చేసుకోవడం మరచిపోవద్దు, మరీ ఘాటుగా ఉండేవి కాకుండా తేలికపాటి సువాసన ఉండేవి అయితే మంచిది. మరీ జెంటిల్మన్ కనిపించాలని ఆఫీసుకు వేసుకునే షూస్ని వాడకండి. డ్రెనికి సూటయ్యే చెప్పులు, లేదా వెరైటీ మాస్ వేసుకోండి. కానీ అవి నీట్ గా ఉండేలా చూసుకోండి.

V6, VELUGU LIFE