భారతీయులు ఎక్కువగా ఇష్టపడే చిరుతిండ్లలో పానీ పూరీ ఒకటి. దీనిని తినేందుకు చాలా మంది అమితంగా ఇష్టపడతారు. చిన్నపాటి పూరీలను నూనెలో వేస్తే రౌండ్ బాల్స్ లా తయారు అవుతాయి. వాటిలో బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, బంగాళదుంప మసాలను మధ్యలో రంధ్రం చేసి పెడతారు. కొన్ని మసాలలతో ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న నీటిలో ముంచి ఆహారంగా తీసుకుంటారు. ఆయాప్రాంతాలను బట్టి పానీ పూరిలో వినియోగించే పదార్ధాల్లో కొంచెం తేడా ఉంటుంది.
పానీ పూరి.. అనే పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీ పూరిని గోల్ గప్పా, గప్ చుప్ మొదలైన అనేక పేర్లతో పిలుస్తారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇష్టపడే ఆహారం పానీపూరీ (Panipuri). మీరు చాలా రకాల పానీ పూరీలను గురించి విని ఉంటారు. లేదంటే తినుంటారు కూడా. కానీ మీరు ఎప్పుడైనా బంగారం, వెండి పానీ పూరీలను తిన్నారా? బంగారం, వెండి పానీ పూరీ ఎలా ఉంటుందోనని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కాదా..? కానీ, ఇక్కడ అలాంటి పానీపూరీ విక్రయం జరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడాల్సిందే. వివరాల్లోకి వెళితే.
కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు, గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి పానీ పూరీ సరికొత్త వెర్షన్‌ను లాంఛ్ చేశాడు. బంగారు, వెండి పూతతో తయారు చేసిన పానీపూరీలను అతడు విక్రయిస్తున్నాడు. ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా వేస్తున్నాడు. వాటిని బంగారు రంగు ప్లేట్‌లోనే పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పానీపూరీలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రియేటివిటీని కొందరు మెచ్చుకుంటున్నారు. మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోలో వ్లాగర్లు ఖుష్బూ, మనన్ ఈ కొత్త పానీ పూరీని మనకు అందించారు. వీడియోలో చూపిన విధంగా – పానీ పూరీకి బాదం, జీడిపప్పు, పిస్తాలను కూడా యాడ్‌చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత దానికి తేనె కూడా కలుపుతూ కనిపిస్తారు. చివరగా ఆ పూరీలన్నీ ఒక ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసేందుకు సిద్ధంచేశారు. అందుకోసం ప్రతి పానీ పూరీని బంగారం, వెండి పూతతో అలంకరించారు. ఈ పానీ పూరీని బంగారు పళ్ళెంలో వడ్డిస్తున్నారు. ఈ పానీ పూరి పేరు షరీట్. ప్రస్తుతం ఈ పానీ పూరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ఈ పానీ పూరి పేరు షరీట్. ప్రస్తుతం ఈ పానీ పూరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. cherishing_the_taste అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 53 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. బ్రదర్.. వీటి ధర ఎంత.. ఇది డబ్బున్న వారి పానీపూరీ... దీనిని బప్పీలహరి పానీపూరీ అంటారు అంటూ కామెంట్లు చేశారు.