శాతవాహనను నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతా

  •  ఫ్యాకల్టీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, న్యాక్ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, కాన్వొకేషన్, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ అడ్మిషన్లే టాప్ ప్రయారిటీ 
  •  కొత్త కోర్సులు తీసుకొస్తా..సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్​గా మారుస్తా
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్

కరీంనగర్, వెలుగు : వచ్చే మూడేళ్ల తన పదవీకాలంలో శాతవాహన యూనివర్సిటీని నంబర్ వన్ వర్సిటీగా తీర్చిదిద్దుతానని కొత్త వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ తెలిపారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్, న్యాక్ అసెస్ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లడం, రెండోసారి కాన్వొకేషన్ నిర్వహించడం, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ అడ్మిషన్లు చేపట్టి పరిశోధనలను ప్రోత్సహించడం టాప్ ప్రయార్టీగా తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. 

తనకు గతంలో ఇక్కడ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేసిన అనుభవం ఉందని, వర్సిటీ సమస్యలపై అవగాహన ఉందని చెప్పారు. వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టాక సోమవారం తొలిసారిగా యూనివర్సిటీకి వచ్చిన ఆయన ‘వీ6 వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘వీ6 వెలుగు’లో సోమవారం పబ్లిష్ అయిన ‘శాతవాహన వీసీకి సవాళ్లెన్నో ?’ స్టోరీని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందులో పేర్కొన్న అన్ని సమస్యలను ప్రాధాన్యాలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. 

సిబ్బంది కొరతను తీర్చుతా

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ సిబ్బంది కొరత ఉంది. కేవలం బిల్డింగ్స్ కట్టి అడ్మిషన్లు ఇచ్చి.. ఫ్యాకల్టీ లేకపోతే యూనివర్సిటీల లక్ష్యం నెరవేరదు. అందుకే యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టాప్ ప్రయార్టీగా భావిస్తున్నా. రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయం. అప్పటివరకు  ప్రభుత్వ అనుమతితో పార్ట్ టైం పద్ధతిలోనైనా ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడానికి కృషి చేస్తా. 

రెగ్యులర్.. కొత్త కోర్సులపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యూనివర్సిటీలో గతంలో  రెగ్యులర్ కోర్సులుగా ఉండి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మారిన  బాటనీ, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను రెగ్యులర్ కోర్సులుగా మార్చేందుకు కృషి చేస్తా. గతంలో ఈ అంశంపై ప్రభుత్వానికి ఏమైనా లెటర్ రాశారా..? రాయలేదా? అనే స్టేటస్ ను తెలుసుకుని ముందుకెళ్తాం. యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీతోపాటు బీఈడీ, ఎంఈడీ లాంటి కోర్సులను ప్రారంభించేందుకు కృషి చేస్తా. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్ సైన్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోమెడికల్ సైన్సెస్, ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రారంభించాలనుకుంటున్నాం. అలాగే ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయడంతోపాటు కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటాం. యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభిస్తాం.

న్యాక్, కాన్వొకేషన్ పై ముందుకే.. 

ప్రతి యూనివర్సిటీకి న్యాక్ గ్రేడ్ తప్పనిసరి. కానీ ఇప్పటివరకు శాతవాహన యూనివర్సిటీ న్యాక్ అసెస్ మెంట్ కాలేదు. న్యాక్ కోసం ముందుగా తప్పనిసరిగా అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇది పూర్తి చేశాక వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా న్యాక్ కు వెళ్తాం. అలాగే కాన్వొకేషన్ గతంలో నేను రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. త్వరలోనే రెండోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తాం. 

పారదర్శక పాలన అందిస్తాం..

గత వీసీ హయాంలో ఆన్సర్ షీట్ల స్కానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలాంటి టెండర్ లేకుండానే ఇచ్చారనే విషయం ప్రస్తావించగా.. తాను ఏ పనినైనా టెండర్ ద్వారానే ఇచ్చి పారదర్శకంగా ఉంటానని తెలిపారు. అటెండర్ నుంచి ఫ్యాకల్టీ వరకు ఎవరిని రిక్రూట్ చేసుకున్నా ప్రభుత్వ అనుమతి తీసుకుని, నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తానని స్పష్టం చేశారు. 

విద్యార్థి పక్షపాతిని.. 

నేను మధ్యతరగతి కుంటుంబంలో పుట్టి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరి ఇక్కడికి వీసీగా వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ పదవుల్లో పనిచేశాను. కింది నుంచి వచ్చినవాడిని కాబట్టి విద్యార్థుల సమస్యలు తెలుసు. ఇక్కడ రిజిస్ట్రార్ గా పని చేసిన అనుభవం ఉంది. ఇక్కడ అంతా తెలిసినవాళ్లే. అందరి సహకారంతో యూనివర్సిటీని నంబర్ వన్ గా నిలబెడుతా.