OTT MOVIES : ఈ వారం ఓటీటీ మూవీస్..

  • టైటిల్ : మనోరథంగళ్​​
  • ప్లాట్​ ఫాం : జీ5
  • డైరెక్షన్ : ప్రియదర్శన్, రంజిత్, శ్యామ్ ప్రసాద్ , మహేశ్ నారాయణ్, అశ్వతీ నయ్యర్, జయరాజ్, రతీష్ అంబత్
  • కాస్ట్ : మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, దుర్గా కృష్ణ, అపర్ణా బాలమురళి, పార్వతీ తిరువోతు, సిద్దిఖీ, బిజు మీనన్, హరీష్ ఉత్తమన్, జాయ్ మాథ్యూ, మధు, అసిఫ్ అలీ, నదియా, ఇంద్రజిత్

ఒలవుమ్‌‌‌‌ తీరవుమ్‌ ‌‌‌:  బాపుట్టి (మోహన్‌‌‌‌ లాల్‌‌‌‌) తన ఫ్రెండ్​ చెల్లి నబీషా (దుర్గా కృష్ణ)ని ప్రేమిస్తాడు. కానీ, ఆమె తల్లి మాత్రం  కుంజలి అనే ధనవంతుడికి ఇచ్చి నబీషా పెళ్లి చేయాలి అనుకుంటుంది. ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయిని వదులుకోలేక బాపుట్టి ఏం చేశాడు? కుంజలి ఎలాంటి వాడు? అనేది ఈ కథ. 

కడుగన్నావా :  జర్నలిస్టు వేణు గోపాల్‌‌‌‌ (మమ్ముట్టి) ఒక ముఖ్యమైన మీటింగ్​ కోసం శ్రీలంక వెళ్తాడు. కానీ.. అక్కడ లీల అనే అమ్మాయి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెడతాడు. ఆమె ఎవరు? శ్రీలంకతో వేణు గోపాల్‌‌‌‌ కుటుంబానికి ఉన్న సంబంధమేంటి? అనేది కథ సారాంశం. 

కజ్‌‌‌‌చా :  సుధ (పార్వతి తిరువోతు) మంచి వ్యక్తిత్వం ఉన్న యువతి. సంగీతం అంటే ఆమెకి ప్రాణం. కానీ.. తన అభిరుచులను తన భర్త పట్టించుకోడు. దాంతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. అందుకే అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చుట్టుపక్కల వాళ్ల సూటిపోటి మాటలను ఎలా తీసుకుంది? 

శిలాలిఖితం :  గోపి ( బిజూ మీనన్) లీడ్​రోల్​లో నటించాడు. రోజులు మారేకొద్దీ.. సిటీల్లోనే కాదు ఆచార సంప్రదాయాలు పాటించే పల్లెల్లో కూడా మానవత్వం లేకుండా పోతోందన్న విషయాన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. 

విల్పన :  మానవ సంబంధాల విలువ చాటి చెప్పే ఎపిసోడ్‌‌‌‌ ఇది. మధుబాల, ఆసీఫ్‌‌‌‌ అలీ నటించారు ఇందులో.

షెర్లాక్‌ ‌‌‌:  పని కోసం సొంతూరు విడిచి విదేశాలకు వెళ్లిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్​లో చూడొచ్చు. 

కాదలక్కాట్టు :  ఒకరిని ప్రేమించి మరొకరిని (అపర్ణా బాలమురళి) పెళ్లి చేసుకున్న కేశవ్‌‌‌‌ (ఇంద్రజిత్‌‌‌‌ సుకుమారన్‌‌‌‌) కథ ఇది. 

అభ్యం తీడీ వీండుమ్‌ ‌‌‌: ‘మానవజాతి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకోవాల్సిందే’ అని గుర్తుచేసే ఎపిసోడ్‌‌‌‌ ఇది. 

స్వర్గం తురక్కున్న సమయం :  జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు పిల్లలు తమ దగ్గర లేకపోతే పెద్దవాళ్లు పడే బాధ ఎలా ఉంటుందో చెప్పే ఎపిసోడ్​ ఇది. 

ఇల్లు అమ్మేందుకు..

  • టైటిల్ :  వీరాంజ‌‌‌‌నేయులు విహార‌‌‌‌యాత్ర
  • ప్లాట్​ ఫాం : ఈటీవీ విన్‌‌‌‌
  • డైరెక్షన్ : అనురాగ్ పాలుట్ల
  • కాస్ట్ : న‌‌‌‌రేశ్‌‌‌‌, శ్రీల‌‌‌‌క్ష్మి, ప్రియా వ‌‌‌‌డ్లమాని, రాగ్ మ‌‌‌‌యూర్‌‌‌‌,  ప్రియ‌‌‌‌ద‌‌‌‌ర్శిని, ర‌‌‌‌వితేజ‌‌‌‌, హ‌‌‌‌ర్షవర్ధన్

వీరాంజ‌‌‌‌నేయులు (బ్రహ్మానందం) ఇండియన్​ రైల్వేలో పనిచేసేవాడు. అతను రిటైర్​ అయ్యాక వచ్చిన డబ్బుతో గోవాలో ఒక ఇంటిని కొంటాడు. అతనికి గోవా అంటే చాలా ఇష్టం. అతను కొన్న ఇంటికి ‘హ్యాపీ హోం’ అని పేరు పెడతాడు. ఆ ఇల్లంటే అతనికి ప్రాణం. అందుకే ప్రాణం పోయాక అతని అస్థికలను గోవాలోని సముద్రంలో కలపాలని కోరుకుంటాడు. అతని భార్య కాంతం (శ్రీలక్ష్మి), కొడుకు నాగేశ్వరరావు (నరేశ్).. అతని భార్య, పిల్లలు అంతా వైజాగ్​లోనే ఉంటారు. నాగేశ్వరరావు ఒక స్కూల్లో టీచర్​గా పనిచేస్తుంటాడు. అతని కొడుకు వీరు(రాగ్​ మయూర్​) హైదరాబాద్​లో స్టార్టప్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు. జాబ్ మానేసి ఆ ప్రయత్నాలు చేస్తున్నాడనే విషయం నాగేశ్వరరావుకి తెలియదు.

కూతురు సరయు(ప్రియా వడ్లమాని), తరుణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. అతను బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు. అయినా.. రెండు కుటుంబాలు వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటాయి. కానీ.. పెళ్లి గ్రాండ్​గా చేయాలని కండిషన్​ పెడతారు. ఇదిలా ఉండగా.. ఇప్పటితరం వాళ్లకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం లేదనే కారణంతో నాగేశ్వరరావుని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. తన తండ్రి గోవాలో కొన్న ఇంటిని అమ్మి కూతురి పెండ్లి చేయాలి అనుకుంటాడు. అదే టైంలో హ్యాపీ హోం అమ్మితే 60 లక్షల రూపాయలు ఇస్తామ‌‌‌‌ని ఓ ఆఫ‌‌‌‌ర్ వ‌‌‌‌స్తుంది. దాంతో.. నాగేశ్వరరావు ఫ్యామిలీతో కారులో గోవాకు బయల్దేరతాడు. ఆ ప్రయాణం ఎలా సాగింది? ఇల్లు అమ్మాడా? లేదా? స‌‌‌‌ర‌‌‌‌యు పెళ్లి చేశాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్​ సిరీస్​ చూడాల్సిందే. 

చంపింది మనిషా? దెయ్యమా? 

  • టైటిల్ : కంగారూ
  • ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
  • డైరెక్షన్ : కిషోర్​ మేగలమనె 
  • కాస్ట్ : ఆదిత్య, రంజనీ రాఘవన్, శివమణి, కరి సుబ్బు, అశ్విన్​ హసన్​, నాగేంద్ర

పృథ్వి (ఆదిత్య) అనే పోలీస్​ ఆఫీసర్​ ట్రాన్స్‌‌‌‌ఫ‌‌‌‌ర్ మీద చిక్‌‌‌‌మగళూరు పోలీస్ స్టేష‌‌‌‌న్‌‌‌‌కు వెళ్తాడు. అదే పోలీస్ స్టేష‌‌‌‌న్ ప‌‌‌‌రిధిలో ‘ఆంటోనీ గెస్ట్ హౌజ్’ ఉంటుంది. అందులోకి వెళ్లిన వాళ్లు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ కేసు బాధ్యత పృథ్వి మీద పడుతుంది. అతని ఇన్వెస్టిగేషన్​లో ఆ గెస్ట్​ హౌజ్‌‌‌‌లో అడుగుపెట్టిన125 మంది క‌‌‌‌నిపించ‌‌‌‌కుండా పోయార‌‌‌‌ని తెలుస్తుంది. కానీ.. వాళ్లకు సంబంధించి ఆధారం ఒక్కటి కూడా దొరకదు. దాంతో.. ఆ గెస్ట్ హౌజ్‌‌‌‌లో ఉన్న దెయ్యమే అంద‌‌‌‌రినీ చంపుతోంద‌‌‌‌ని పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ.. పృథ్వి మాత్రం ఆ హత్యల వెనుక ఎవరో ఉన్నారని బలంగా నమ్ముతాడు. మేఘన (రంజని రాఘవన్) అనే సైకాలజిస్ట్‌‌‌‌  ఈ కేసును ఛేదించడంలో అతనికి సాయం చేస్తుంది. దాంతో.. అతను హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు? ఇంతకీ హంతకుడు దొరికాడా? హత్యలు చేసింది మనిషా? దెయ్యమా? అనేదే అసలు కథ. 

చిన్ననాటి ప్రేమ

  • టైటిల్ : మై పర్ఫెక్ట్ హస్బెండ్
  • ప్లాట్​ ఫాం: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
  •  డైరెక్షన్ : తమిర
  • కాస్ట్ :  సత్యరాజ్, సీత, రేఖ, రక్షణ్​, వర్ష బొల్లమ్మ, లివింగ్​స్టన్​ 

భారతి (సత్యరాజ్) కాలేజీ ప్రొఫెసర్​. భార్యను తప్ప మరో మహిళ వంక చూడని ఏకపత్నీవ్రతుడు. తనతోపాటు పనిచేసే విమల (రేష్మా పసుపులేటి)భారతి మీద ఇంట్రెస్ట్​ చూపించినా పట్టించుకోడు. తన జీవితంలో తనకు దొరికిన ఒకే ఒక ప్రేమ తన భార్య సరస్వతి (సీత) మాత్రమే అని అందరినీ నమ్మిస్తాడు. అలా రోజులు గడుస్తుండంగా.. కొడుకు వసీగరన్ (రక్షణ్​)కు పెళ్లి చేయాలి అనుకుంటారు భారతి, సీత. కేరళలో ఉండే దీపిక (వర్ష బొల్లమ్మ)తో పెళ్లి కుదురుతుంది. కానీ.. భారతి ఆ పెండ్లి జరక్కుండా ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనలా ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. అసలు విషయం ఏంటంటే.. దీపిక వాళ్ల అమ్మ భారతి(రేఖ), వసీగరన్​ తండ్రి భారతి స్కూల్​ డేస్​లో ప్రేమించుకుంటారు. అందుకే ఈ ఇద్దరూ పెండ్లికి ఒప్పుకోరు. చివరికి ఈ విషయం సరస్వతికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దీపిక, వసీగరన్​ పెండ్లి జరిగిందా? లేదా? అనేది వెబ్​ సిరీస్​ చూసి తెలుసుకోవాలి. 

అండమాన్​లో డాన్​

  • టైటిల్ : తుఫాన్
  • ప్లాట్​ ఫాం : అమెజాన్​ ప్రైమ్​ వీడియో
  • డైరెక్షన్ : విజయ్ మిల్టన్​
  • కాస్ట్ : విజయ్ ఆంటోని, సత్యరాజ్, ఆర్ శరత్‌‌‌‌కుమార్, మేఘా ఆకాష్, డాలీ ధనంజయ, మురళీ శర్మ, శరణ్య పొన్వన్న, పృథ్వీ అంబార్, తలైవాసల్ విజయ్

సలీమ్ (విజయ్ ఆంటోని) సీక్రెట్ ఏజెంట్. సీక్రెట్​ మిషన్​లో ఉన్నప్పుడు వర్షం కురిసిన ఒక రాత్రి భార్యను పోగొట్టుకుంటాడు. అప్పటినుండి వర్షానికి దూరంగా ఉండాలి అనుకుంటాడు. ఆ తర్వాత అతని చీఫ్ ఆఫీసర్​ (శరత్‌‌‌‌కుమార్) ఒక మిషన్​ కోసం అతన్ని అండమాన్​లోని ఒక రహస్య ప్రదేశంలో ఒంటరిగా ఉండాలని చెప్తాడు. డాలీ (డాలీ ధనుంజయ) అనే వ్యాపారి అధిక వడ్డీ వసూలు చేస్తూ అక్కడివాళ్లను దోచుకుంటుంటాడు. అతన్ని ఎదిరించిన వాళ్లను కిరాతకంగా చంపేస్తుంటాడు. అక్కడే సలీమ్​కు సౌమ్య (మేఘ ఆకాష్) పరిచయం అవుతుంది. గతంలో ఆమె తండ్రిని కూడా డాలీ చంపేస్తాడు. డాలీ బారి నుండి అక్కడివాళ్లను కాపాడేందుకు సలీమ్ ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.