Good News : 896 బ్యాంక్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్.. వెంటనే ఇలా అప్లై చేయండి

దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ 896 పోస్టులకు సెలక్షన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ రెండు దశల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు వారై ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5, బీసీలకు 3, దివ్యాంగులకు 10, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి ఉంది. 

పోస్టుల వివరాలు

  •  ఐటీ ఆఫీసర్: 170 పోస్టులుఅగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: 346 పోస్టులు
  •  రాజ్‌భాష అధికారి: 25 పోస్టులు
  • లా ఆఫీసర్: 125 పోస్టులు
  • హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ : 25 పోస్టులు
  • మార్కెటింగ్ ఆఫీసర్ : 205 పోస్టులు