రాష్ట్రపతి భవన్​లో 2 హాళ్లకు కొత్త పేర్లు

రాష్ట్రపతి భవన్​లో పలు వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్​ హాల్​, అశోక్​ హాల్​ పేర్లు మారాయి. వాటిని ఇకపై వరుసగా గణతంత్ర మండపం, అశోక్​ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

    దర్బార్​ హాల్​ జాతీయ అవార్డు ప్రదానం వంటి ముఖ్యమైన వేడుకలకు వేదికగా ఉంటుంది. ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్​ అనేవారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యత కోల్పోయింది. 

    గణతంత్ర భావన భారత సమాజంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్​కు గణతంత్ర మండపం సరైందని రాష్ట్రపతి భవన్​ పేర్కొన్నది. అశోక్​ హాల్​ ఒక బాల్​రూమ్​. అశోక్​ అంటే అన్ని బాధల నుంచి విమక్తుడైన వ్యక్తి అని అర్థం అని వెల్లడించింది. ఈ కారణంతోనే పేరు మార్చారు. 
    అశోక అన్న పదానికి అన్ని బాధల నుంచి విముక్తి కలిగిన వ్యక్తి అని అర్థం. అంతేగాక అశోక చక్రవర్తిని కూడా సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక్​ హాల్​ పేరును అశోక్​ మండపంగా మార్చడం భాషలో ఏకరూపతను తెలుస్తుందని రాష్ట్రపతి భవన్​ పేర్కొన్నది.