టైటిల్ : లా పతా లేడీస్
డైరెక్షన్ : కిరణ్ రావ్
కాస్ట్ : ప్రతిభ రాంటా, స్పర్ష్ శ్రీవాత్సవ, రవి కిషన్, నితాన్షి గోయల్, ఛాయ కదమ్
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
దీపక్ కుమార్ (స్పర్ష్ శ్రీవాత్సవ), ఫూల్ (నితాన్షి గోయల్)ను పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత దీపక్ వాళ్లు ఉండే ముర్తి అనే ప్లేస్‌కి రైల్లో బయల్దేరతారు. ఆ రోజు ఎంతో పవిత్రమైన తృతీయ. అందుకని చాలామంది పెండ్లిండ్లు చేసుకుంటారు. దాంతో ఆ రైలంతా కొత్తగా పెళ్లయిన జంటలతో నిండిపోయి ఉంటుంది. దీపక్, ఫూల్ ఆ ట్రైన్లో మరో కొత్త జంట పక్కన కూర్చుంటారు. పెళ్లికూతుళ్లందరూ తమ ముఖాలను ఎరుపు రంగు ముసుగుతో కప్పుకున్నారు.
దిగాల్సిన స్టేషన్ రాగానే దీపక్ పొరపాటున మరో పెళ్లి కూతురు (ప్రతిభ రాంటా)ని తీసుకుని దిగి, వాళ్లింటికి తీసుకెళ్తాడు. పుష్ప తన ముసుగును తొలగించేసరికి ఆ ఇంటి వాళ్లంతా షాక్ అవుతారు. ఇక మిగతా కథంతా దీపక్ మిస్ అయిన తన భార్యను వెతకడంతో ఉంటుంది. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా ఉంటూనే సమాజానికి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఆఖరి అరగంట ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.
సినిమా చూశాక ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. అలాగే ఆలోచనల్లో కూడా పడేస్తుంది. ఈ మధ్యకాలంలో మహిళా క్యారెక్టర్లను అంత బాగా రాసిన సినిమా ఇది. నటీనటులంతా చాలా బాగా నటించారు. మరీ ముఖ్యంగా ప్రతిభ, రవి కిషన్‌లు షో స్టీలర్స్ అని చెప్పొచ్చు. సినిమా ప్రేక్షకుల మనసు మీద ఏదో ఒక రకంగా ముద్ర వేస్తుంది. కాకపోతే కాస్త స్లోగా నడుస్తుంది. సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న విషయాలను హైలైట్ చేసింది. కుటుంబం అందరూ కలిసి చూడదగిన సినిమా.
పాత సబ్జెక్ట్‌తో...
టైటిల్ : దిల్ దోస్తి డైలమా
డైరెక్షన్ : డెబ్బీ రావు
కాస్ట్ : అనుష్క సేన్, కుష్ జోత్వాని, తన్వీ అజ్మీ, శిశిర్ శర్మ, సుహాసిని ములే, అర్జున్ బెర్రీ, శృతి సేథ్, ఖలీద్ సిద్దిఖీ, పరిణితా సేథ్, విశాఖ పాండే, రేవతి పిళ్లయ్, ఎలిషా మేయర్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ వీడియో సిరీస్‌ను అండాలీబ్ వాజిద్ రాసిన ‘అస్మారాస్ సమ్మర్’ అనే యంగ్ అడల్ట్ నవల ఆధారంగా తీశారు.అస్మారా(అనుష్క సేన్) బెంగళూరులో ఉండే టీనేజర్. తన బెస్ట్ ఫ్రెండ్స్ తానియా, నైనాలతో కలిసి షాపింగ్ చేయడం, సరదాగా తిరగడం తప్ప వేరే ఆలోచన ఉండదు. అస్మారా సమ్మర్ హాలీడేస్‌కి కెనడాకి వెళ్దాం అని ప్లాన్ చేస్తుంది. కానీ ఆ తరువాత జరిగిన ఒక సంఘటన వల్ల అస్మారాని తల్లి (శృతి సేన్) ఎలాగైనా సరైన బాధ్యత తెలిసేలా చేయాలి అనుకుంటుంది. అందుకు గ్రాండ్‌పేరెంట్స్ ఉంటున్న ఊరికి పంపేయాలి అని డిసైడ్ అవుతుంది.
కానీ అస్మారాకు మధ్యతరగతి వాతావరణంలో ఉంటున్న ఆ ఇంటికి వెళ్లడం ఇష్టం ఉండదు. అయినా కూడా బలవంతంగా అస్మారాను అక్కడికి పంపిస్తారు. నానమ్మ (తన్వీ అజ్మీ) ‘నలుగురు ఏం అనుకుంటారు?’ అని ఆలోచించే నేచర్ అస్మారాకు నచ్చదు. తాతయ్య (శిశిర్ శర్మ) లిబరల్గా ఉంటాడు. అస్మారా తన ఫ్రెండ్స్‌తో తను కెనడాలో ఉన్నట్టే చెప్తుంటుంది. అలా జరిగిపోతున్న ఆమె సెలవుల జర్నీలో నెమ్మదిగా ఆమెకు ఆ ఊరు నచ్చడం మొదలవుతుంది. ప్రత్యేకించి ఫరాజ్ (కుష్ జోత్వాని), రుక్సానా(విశాఖ పాండే), పక్కింట్లో ఉండే (సుహాసిని ములే) మనవళ్లు మనవరాళ్లు అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఈ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఈ సిరీస్ చూడాలంటే కావాల్సింది ఓపిక. ఖాళీ టైం.
స్టంట్స్ సక్సెస్ తెచ్చాయా?
టైటిల్ : క్రాక్, డైరెక్షన్ : ఆదిత్య దత్
కాస్ట్ : విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్, ప్లాట్ ఫాం : డిస్నీ+హాట్‌స్టార్
క్రాక్– జీతేగా తో జియేగా అంటూ ఫిబ్రవరిలో థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పడు ఓటీటీకి వచ్చింది. పోలాండ్‌లో మైదాన్ అనే క్రీడా ప్రపంచం ఒకటి ఉంటుంది. దానికి కింగ్ దేవ్ (అర్జున్ రాంపాల్). అక్కడ ప్రపంచవ్యాప్తంగా స్టంట్స్‌లో నిష్ణాతులైన యువతకు రేస్‌లు పెడుతూ గెలిచిన వాళ్లకి కోట్లల్లో బహుమానం ఇస్తుంటాడు. ఇదిలా ఉంటే డబ్బు విషయంలో శిఖరాన ఉండాలని ఆలోచించే ముంబయికి చెందిన సిద్ధార్థ్ దీక్షిత్ అసియాస్ సిద్ధు(విద్యుత్ జమ్వాల్) మైదాన్‌లోకి ఎలాగైనా వెళ్లాలి అనుకుంటాడు.
అదే మైదానంలో అంతకుముందు తన అన్న ప్రాణాలు కోల్పోయాడని తెలిసినా తల్లీతండ్రి వద్దని చెప్పినా వినకుండా వెళ్తాడు అక్కడికి. మొదటి టాస్క్ గెలిచాక మైదాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలియా (నోరా ఫతేహి) ప్రేమలో పడతాడు. దేవ్ స్పోర్ట్స్ పేరిట ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నాడని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ నోవక్ (అమీ జాక్సన్) అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అప్పుడామెకు ఆ పని సిద్ధు వల్లనే అవుతుందని తెలుస్తుంది. ఆమె ప్లాన్‌ను సిద్ధు ఒప్పుకుంటాడా? తన అన్న మరణానికి కారణం ఏంటనేది తెలుసుకుంటాడా? మైదాన్‌లో విన్నర్‌గా నిలిచాడా? లేదా? అనేది సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకు అందదు. సీక్వెల్ ఉంటుందనే హింట్ చివర్లో ఇచ్చారు.