OTT MOVIES : విడదీయలేని బంధం

 విడదీయలేని బంధం

టైటిల్ : గరుడన్
ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్
కాస్ట్ : సూరి, శశికుమార్, సముద్రఖని, ఉన్ని ముకుందన్

కొంబాయిలో ఉండే ఆది (శశికుమార్), కరుణ (ఉన్ని ముకుందన్) చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. ఒకప్పుడు బాగా ధనవంతులైన జమీందార్ కుటుంబానికి చెందినవాడు కరుణ. కానీ.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఇటుక బట్టీ నడుపుకుని బతుకుతుంటాడు. కరుణ అమ్మమ్మ సెల్లాయి (వడివుక్కరసి) వాళ్ల ఊరి ఆలయ కమిటీకి ఛైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. అయితే.. అవినీతి రాజకీయ నాయకుడైన తంగపాండి(ఆర్‌‌‌‌‌‌‌‌.వి. ఉదయకుమార్) ఆలయానికి చెందిన విలువైన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్లాన్ వేస్తాడు.

కమిటీ వాళ్ల దగ్గర ఉన్న పురాతన భూమి యాజమాన్య రాతపత్రాలను తీసుకొచ్చే పనిని తన బంధువు నాగరాజ్ (మైమ్ గోపి)కి అప్పగిస్తాడు. అయితే.. సొక్కన్ (సూరి) చిన్నప్పటినుంచి సెల్లాయి కుటుంబానికి నమ్మకమైన సేవకుడిగా ఉంటాడు. కరుణ చిన్నప్పుడు తన ప్రాణాలను కాపాడిన సొక్కన్ ఒక అనాథ. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా కరుణ అమ్మమ్మ సెల్లాయి చనిపోతుంది. దాంతో.. సొక్కన్ ఆలయానికి కొత్త ట్రస్టీగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పత్రాల దొంగతనం జరిగిందా? భూమిని కాపాడేందుకు సొక్కన్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఓ చిన్న కుటుంబం

టైటిల్ : ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్
ప్లాట్​ ఫాం : జియో సినిమా
డైరెక్షన్ : అరవింద్ శాస్త్రి
కాస్ట్ : సుఖితా అయ్యర్, ప్రీతమ్ కోయిల్‌‌‌‌‌‌‌‌పిళ్లై, సంజన దాస్, అమృత్ జయన్

బెంగళూరులోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నలుగురు కుటుంబ సభ్యులున్న మూర్తి  కుటుంబం నివాసం ఉంటుంది. కొవిడ్‌‌‌‌‌‌‌‌ – 19లో వాళ్లంతా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. మనోహర్ మూర్తి (ప్రీతమ్ కోయిల్‌‌‌‌‌‌‌‌పిళ్లై) ఒక కంపెనీలో సాఫ్ట్​వేర్​ డెవలపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంటాడు.

అతని భార్య సుష్మ (సుఖితా అయ్యర్). కూతురు నిషా(సంజన దాస్) యాక్టర్‌‌‌‌‌‌‌‌, సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్​గా పేరు తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. కొడుకు శివ (అమృత్ జయన్) కరోనా టైంలో ఇంట్లో ఉంటాడు. వీళ్లంతా ప్రతి రోజూ బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అలాంటి టైంలో వాళ్లకు ప్రైమ్–టైమ్ న్యూస్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఆధారం. ఇక మిగతా టైంలో ఎవరి ప్రపంచం వాళ్లది. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. వాళ్లంతా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌. 

సింహాసనం ఎవరిది? 

టైటిల్ : మీర్జాపూర్ సీజన్ 3
ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌‌‌‌‌‌‌ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో
డైరెక్షన్ : గుర్మీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌
కాస్ట్ : పంకజ్‌‌‌‌‌‌‌‌ త్రిపాఠి, అలీ ఫజల్‌‌‌‌‌‌‌‌, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌ వర్మ

మీర్జాపూర్ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి రెండు సీజన్లు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఇప్పుడు మూడో సీజన్‌‌‌‌‌‌‌‌ని రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మొదటి రెండు సీజన్లకు కొనసాగింపుగా మూడో సీజన్‌‌‌‌‌‌‌‌ కథ మొదలవుతుంది. గుడ్డు (అలీ ఫజల్‌‌‌‌‌‌‌‌), గోలు (శ్వేత త్రిపాఠి) దాడి చేయడంతో మున్నా భాయ్​ (దివ్యేందు) చనిపోతాడు. కాలీన్‌‌‌‌‌‌‌‌ భయ్యా (పంకజ్‌‌‌‌‌‌‌‌ త్రిపాఠి) తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు అనుకుంటారంతా.  

కానీ.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాలీన్ భాయ్​‌‌‌‌‌‌‌‌ని శరద్ శుక్లా (అంజుమ్ శర్మ) రహస్యంగా దాచి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయిస్తుంటాడు. కాలీన్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో మీర్జాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తన కంట్రోల్‌‌‌‌‌‌‌‌కి తీసుకోవాలి అనుకుంటాడు గుడ్డు. కానీ.. కాలీన్ భాయ్ శవం దొరకదు కాబట్టి మీర్జాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింహాసనం మీద కూర్చునే అర్హత గుడ్డూ భాయ్‌‌‌‌‌‌‌‌కి  లేదని శరద్ శుక్లా అడ్డు పడుతుంటాడు.

గుడ్డూ మాత్రం కాలీన్‌‌‌‌‌‌‌‌ భాయ్‌‌‌‌‌‌‌‌ గుర్తులు లేకుండా చెరిపేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. మున్నా భాయ్‌‌‌‌‌‌‌‌ చావుతో మాధురీ యాదవ్‌‌‌‌‌‌‌‌ (ఇషా తల్వార్‌‌‌‌‌‌‌‌) రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. అంతేకాదు..  చీఫ్​ మినిస్టర్​ కూడా అవుతుంది. కాలీన్‌‌‌‌‌‌‌‌ భయ్యాపై సింపతీని క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసి, ప్రజలకు దగ్గర కావాలి అనుకుంటుంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఎత్తులు వేస్తుంటుంది. చివరికి వీళ్లలో ఎవరు సక్సెస్ అయ్యారు? అధికారం కోసం శరద్ శుక్లా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? గుడ్డూకి మీర్జాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కిందా? లేదా? 

ఒంటెల మధ్య గోపి

టైటిల్ : మలయాళీ ఫ్రమ్ ఇండియా
ప్లాట్​ ఫాం : సోనీ లివ్
డైరెక్షన్ : డిజో జోస్ ఆంటోనీ
కాస్ట్ : నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్, మంజు పిళ్లై, దీపక్ జెథీ, సలీం కుమార్, షైన్ టామ్ చాకో, సంతోష్ జి. నాయర్

కేరళలోని ముల్లకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గోపి (నివిన్ పౌలీ)కి చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు. తల్లి, చెల్లి మాత్రమే అతని ప్రపంచం. అలాగని కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్నాడు అనుకుంటే పొరపాటే. రోజూ తన ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ మల్ఘోష్ (ధ్యాన్ శ్రీనివాసన్)తో కలిసి ఆవారాగా తిరుగుతుంటాడు. దాంతో తన కొడుక్కి ఏదైనా దారి చూపించమని తల్లి తన సోదరుడిని అడుగుతుంది. దాంతో గోపికి జాబ్ చూసే పనిలో ఉంటాడు అతని మేనమామ.

ఇదిలా ఉండగా.. గోపీకి క్రికెట్​, రాజకీయాలంటే విపరీతమైన పిచ్చి. రాజకీయాల్లో రైట్ వింగ్ పార్టీని సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి మా పార్టీ వస్తుందని ప్రచారం చేస్తుంటాడు. కానీ.. ఆ పార్టీ ఓడిపోతుంది. దాంతో.. క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడడం మొదలుపెడతాడు. ఒకసారి క్రికెట్​ ఆడుతున్నప్పుడు అతను కొట్టిన బంతి తగిలి అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోతాయి. దాంతో.. గొడవ మొదలవుతుంది. అదే టైంలో ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అందులో పాకిస్తాన్ గెలవడంతో కొందరు టపాకాయలు కాలుస్తారు.

దాంతో కోపంతో గోపి, మల్ఘోష్  కలిసి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తారు. ఈ విషయం బయటికి తెలుస్తుంది. మల్ఘోష్ అపోజిషన్‌‌‌‌‌‌‌‌ వాళ్ల చేతికి చిక్కుతాడు. పోలీసులు గోపిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ.. గోపి తన మేనమామ ద్వారా ఉద్యోగం సంపాదించి గల్ఫ్‌‌‌‌‌‌‌‌కి పారిపోతాడు. కానీ.. అక్కడ మోసపోయి ఎడారిలో ఒంటెలను కాస్తూ.. బతకాల్సి వస్తుంది. అక్కడి మేనేజర్ జలాల్ రషీద్ (దీపక్ జెథీ) వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గోపిలో మార్పు వచ్చిందా? తిరిగి ఇండియాకు వచ్చాడా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

మొదటి రాత్రి 

టైటిల్ : మందాకిని 
ప్లాట్​ ఫాం : మనోరమ మ్యాక్స్ 
డైరెక్షన్ : వినోద్ లీల
కాస్ట్ :  అల్తాఫ్ సలీం, అనార్కలి మరికర్, సరిత కుక్కు, వినీత్ తట్టిల్, గణపతి, అశ్వతి శ్రీకాంత్

పెద్దలు అంబిలి (అనార్కలి), ఆరోమల్ (అల్తాఫ్)కు పెండ్లి చేస్తారు. మొదటిరాత్రికి ముహూర్తం ఫిక్స్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. అయితే.. ఆరోమల్ భయస్తుడు కావడంతో అతనిలో ధైర్యం నింపేందుకు అతని బావ మందు తాగించాలి అనుకుంటాడు. ఆరోమల్‌‌‌‌‌‌‌‌కి తెలియకుండా కాక్‌‌‌‌‌‌‌‌టెయిల్‌‌‌‌‌‌‌‌ కలిపిన గ్లాస్‌‌‌‌‌‌‌‌ ఇస్తాడు. కానీ అది కాక్‌‌‌‌‌‌‌‌టెయిల్‌‌‌‌‌‌‌‌ అనే విషయం తెలియక అంబిలి దాన్ని తాగేస్తుంది.

దాంతో ఆరోమల్‌‌‌‌‌‌‌‌కి రావాల్సిన ధైర్యం అంబిలికి వస్తుంది. తాగిన మత్తులో భర్తతో తన గతం గురించి చెప్తుంది. పెండ్లికి ముందే ఆమె సుజిత్ వాసు (గణపతి)ని ప్రేమిస్తుంది. కానీ.. అతను మోసం చేస్తాడు. ఆరోమల్ తల్లి రాజలక్ష్మి (సరిత కుక్కు) భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లల్ని తానే పెంచి పెద్ద చేస్తుంది. డ్రైవింగ్ స్కూల్ నడుపుతుంటుంది. చాలా ధైర్యవంతురాలు ఆమె. ఆమెకు అంబిలి, సుజిత్‌‌‌‌‌‌‌‌ల విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సినిమాలో చూడాలి. 

ఎరక్కపోయి ఇరుక్కున్నాడు!

టైటిల్ : శశిమథనం
ప్లాట్​ ఫాం : ఈటీవీ విన్‌‌‌‌‌‌‌‌
డైరెక్షన్ : వినోద్ గాలి
కాస్ట్ : సోనియా సింగ్, పవన్ సిద్ధు, కేశవ్ దీపక్, రూపా లక్ష్మి, శ్రీ లలిత, వెంకటేష్

మ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌న్ (ప‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌న్ సిద్ధు) బాధ్యత లేకుండా తిరిగే ఒక మధ్యతరగతి అబ్బాయి. వాళ్ల కుటుంబం వరంగల్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. అన్నయ్య సంపాదన మీద ఆధారపడి బతుకుతుంటాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న శశి (సోనియా సింగ్)ని ప్రేమిస్తుంటాడు.  అయితే.. ఒకసారి పేకాట‌‌‌‌‌‌‌‌, బెట్టింగ్​లో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తికి అయిదు లక్షల రూపాయలు అప్పు పడతాడు.  అతను డబ్బు కోసం ఇబ్బంది పెడుతుండడంతో తన అన్న బైక్‌‌‌‌‌‌‌‌ని తాక‌‌‌‌‌‌‌‌ట్టు పెడ‌‌‌‌‌‌‌‌తాడు. అయినా అప్పు తీర‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌పోవ‌‌‌‌‌‌‌‌డంతో కొద్ది రోజులు భాస్కర్​కు దొర‌‌‌‌‌‌‌‌క్కుండా ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటాడు.

సరిగ్గా అదే టైంలో శ‌‌‌‌‌‌‌‌శి తన ఫ్యామిలీతోపాటు ఒక పెండ్లి కోసం పది రోజులు ఇల్లు విడిచి వెళ్తున్నానని చెప్తుంది. కానీ.. మదన్ శశిని ఒప్పించి తనను వెళ్లకుండా చేస్తాడు. వాళ్ల ఫ్యామిలీ తిరిగి వచ్చేవరకు శశితోపాటు వాళ్ల ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే ఇంట్లో చేరతాడు. కానీ.. శశి ఫ్యామిలీ వాళ్లు వెళ్తున్న పెండ్లి క్యాన్సిల్ కావ‌‌‌‌‌‌‌‌డంతో అదేరోజు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. దాంతో మ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌ను త‌‌‌‌‌‌‌‌ల్లిదండ్రుల కంటప‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌కుండా త‌‌‌‌‌‌‌‌న రూమ్‌‌‌‌‌‌‌‌లోనే సీక్రెట్‌‌‌‌‌‌‌‌గా దాచేస్తుంది శ‌‌‌‌‌‌‌‌శి. అదే టైంలో శశికి తన మేనత్త రంగమ్మ (రూపాలక్ష్మి) ఒక సంబంధం తీసుకొస్తుంది. ఆమె పోలీస్ ఆఫీసర్ కావడంతో మదన్ విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని శశి భయపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మదన్ దొరికిపోయాడా? తెలియాలంటే  సిరీస్‌‌‌‌‌‌‌‌ చూడాలి.