గూగుల్ మ్యాప్స్ వాడే వారికి సూపర్ గుడ్‌న్యూస్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు గోప్యత మీద కంపెనీ ఫొకస్ చేసింది. గూగుల్ మ్యాప్స్ యాప్ లో యూజర్ల ప్రైవసీ కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసిన లొకేషన్ నావిగేషన్ హిస్టరీ డైరెక్ట్ డివైస్ లో సేవ్ అవుతుంది. ఇప్పటి వరకు లొకేషన్ హిస్టరీ గూగుల్ క్లౌడ్ లో సేవ్ అయ్యేది. కానీ ఇపై నేరుగా వారు వాడే డివైస్ లోనే స్టోర్ అవ్వనుంది. 

క్లౌడ్ లో సేవ్ అయితే వేరేవాళ్లు ఆ డేటాని సులభంగా తెలుసుకోవచ్చు. డైరెక్ట్ మొబైల్ లోనే సేవ్ అయితే కేవలం యూజర్ మాత్రమే లొకేషన్ హిస్టరీ డేటా మ్యానేజ్ చేసుకోవచ్చు. ఐఎస్ఓ, ఆండ్రాయిడ్ ఫోన్లు రెండిట్లో ఈ అడ్డే్ట్ వచ్చింది. క్లౌడ్ తో పోల్చుకుంటే డివైస్ లో గూగుల్ మ్యాప్స్ హిస్టరీ డేటా సేవ్ అయితే యూజర్ల ప్రైవసీ మెరుగైతుంది.