తెలియని ప్రాంతాలకు మొదటిసారి వెళ్తుంటే లొకేషన్ షేర్ చేయమని’ అక్కడున్న వాళ్లని అడగడం సహజం. వాట్సాప్ లేదా వేరే లొకేషన్ షేరింగ్ యాప్‌ల నుంచి లొకేషన్ పంపిస్తారు అవతలి వాళ్లు. అయితే, ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. గూగుల్ ఉంటే చాలు వెళ్లాల్సిన రూట్, షార్ట్ కట్లతో సహా చెప్పే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ వాడాలంటే వాట్సాప్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు. గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు.
- యాప్‌లో లాగిన్ అయ్యి, ప్రొఫైల్ లింక్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.
- అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
- స్క్రీన్‌పై కనిపిస్తున్న న్యూ షేర్ పై క్లిక్ చేసి టైం సెట్ చేయొచ్చు.
- లేదంటే ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ సెలక్ట్ చేసి కాంటాక్ట్ ఎంచుకుని ఎస్సెమ్మెస్ మెసేజ్ పంపాలి.