పరీక్ష జరిగిన ఒక రోజులోనే రద్దు చేసిన యూజీసీ నెట్ ఎగ్జామ్ రీ షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం ప్రకటించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 18న నిర్వహించారు. 317 నగరాల్లో, 1205 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. 11 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైం కో ఆర్టినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో NTA ఆ పరీక్షను రద్దు చేసింది. NCET 2024 మరియు joint CSIR UGC NET 2024 పరీక్షలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పోస్ట్ పోన్ చేసింది.
తిరిగి యూజీసీ నెట్ 2024 పరీక్షను ఆగస్టు 21 మరియు సెప్టెంబర్ 4 మధ్య తిరిగి నిర్వహించనున్నట్లు NTA నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది. గతంలో దీన్ని పెన్ అండ్ పేపర్ మోడ్ లో జరపగా.. ఇప్పుడు ఆన్ లైన్ మోడ్ లో నిర్వహించనుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. NCET 2024 ను జూలై 10, joint CSIR UGC NET 2024 జూలై 25 నుంచి 27 వరకు జరగనున్నాయి.