కొత్త దంపతులకు ఈ గిఫ్ట్స్ అస్సలు ఇవ్వకూడదట.. ఎందుకంటే...

పెళ్లికెళ్లినా.. పేరంటానికి వెళ్లినా.. గిఫ్ట్స్​ ఇస్తుంటారు.  వివాహ కార్యక్రమాల్లో  పెళ్లి అయిన తరువాత చదివింపుల కార్యక్రమం కూడా ఉంటుంది.  చాలా మంది గిఫ్ట్స్​ ను ప్యాకింగ్​ చేసి కొత్త దంపతుల చేతిలో పెడతారు.  కామన్‌గా ఎవరికి పెళ్లైనా బహుమతులు ఇవ్వడం అనేది సర్వ సాధారణమైన విషయం. అందులోనూ ఫ్రెండ్స్ సరికొత్తగా ఉండే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అకేషన్‌కు తగ్గట్టు గిఫ్ట్స్ ఇస్తారు. వారికి ఉపయోగపడేవో లేక మనకు నచ్చినవో బహుమతులుగా ఇస్తారు. అయితే కొత్తగా పెళ్లైన వారికి మాత్రం కొన్ని రకాల వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదట. పెళ్లైన కొత్త జంట హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ గిఫ్టులు ఇస్తూ ఉంటారు. కానీ తెలిసీ తెలియక ఇచ్చే కొన్ని బహుమతుల వల్ల వారికి లాభం కంటే నష్టాలను తెచ్చి పెడతాయట. మరి ఎలంటి బహుమతులను ఇవ్వకూడదు? వాటి వల్ల వారికి ఎలాంటి నష్టం కలుగుతుందో.. ఇప్పుడు చూద్దాం.

నలుపు రంగు వస్తువులు: కొత్తగా పెళ్లైన జంటకు నలుపు రంగు వస్తువులు కూడా ఇవ్వకూడదట. సాధారణంగా నలుపు రంగు అనేది ప్రతికూల శక్తితో ముడి పడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే పెళ్లికి సంబంధించిన ఎలాంటి తంతులోనైనా.. నలుపు రంగు లేకుండా చేస్తారు. కాబట్టి వీరికి బహుమతులుగా ఇచ్చే వస్తువుల్లో కూడా నలుపు రంగు లేకుండా చూసుకోవాలి. ఇలాంటి గిఫ్ట్స్ వల్ల వారి జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ సారి ఇచ్చే గిఫ్ట్స్ లో ఈ కలర్ లేకుండా చూసుకోండి.

గాజు వస్తువులు: పెళ్లికి ఎక్కువగా వచ్చే గిఫ్ట్స్‌లో గాజు వస్తువులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి వీటిని చూడగానే ఎవరికైనా నచ్చుతాయి. అందుకే గాజు వస్తువులను కూడా బహుమతులుగా ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కొత్త జంట లైఫ్‌లో కొంత ప్రతికూల ప్రభావం పడుతుందట

గడియారాలు:కొత్తగా పెళ్లైనవారికి చాలా వరకూ గోడ గడియారాలు లేదా హ్యాండ్ వాచ్‌లను గిఫ్ట్స్‌గా ఇస్తూ ఉంటారు. అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వధూవరులకు గడియారాలను బహుమతులుగా ఇవ్వకూడదట. గడియారంలో ఉండే ముళ్లు మంచి, చెడులకు చిహ్నాలుగా ఉంటాయి. వీటి వల్ల కొత్త జంట వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావం పడుతుందట. ఇటువంటి బహుమతుల వల్ల సమయ సంబంధిత సమస్యలు వస్తాయని నమ్ముతారు..

పదునైన వస్తువులు:అదే విధంగా కొత్తగా పెళ్లైన వధూవరులకు పదునైన వస్తువలను కూడా గిఫ్ట్స్‌గా ఇవ్వకూడదు. ఇలాంటి వస్తువుల వల్ల వాళ్ల బంధంలో అంతరం ఏర్పడవచ్చు.