సత్యనారాయణ స్వామి వ్రతం.. ఎంతో పవర్ ఫుల్ పూజ ఇదీ.. ఏ ఇంట్లో అయినా కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటే ఈ పూజ చేయాలంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఈ పూజ చేసుకుంటారు. ఈ వ్రతానికి ఎంతో శక్తి ఉంది. పెళ్లి అయిన తరువాత కోడలు ఇంటికి రావడంతోనే ఎందుకు సత్యనారాయణ వ్రతం చేయిస్తారో తెలుసుకుందాం. . ..
సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొడుకుకు పెళ్లి అయిన తర్వాత కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల వారి కొత్త జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి సంసార జీవితం సంతోషంగా కొనసాగుతుందని పిల్లాపాపలు కూడా తొందరగా కలుగుతారని భావించి కొత్త కోడలితో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు. ఇలా గత కొంతకాలంగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది.
ఈ విధంగా కొత్తగా పెళ్లయిన కోడలితో ఈ వ్రతం చేయించకపోతే దోషాలు ఏర్పడతాయని భావించి ఈ వ్రతం ఆచరిస్తారు. అలాగే త్రిమూర్తుల ఏకరూపమై సత్యనారాయణ స్వామి భూమిపై అవతరించారని,స్వామివారు అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు అందుకే కొత్తగా పెళ్లయిన వారు లేదా గృహప్రవేశం చేస్తున్న వారు కూడా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు.
ఇక ఈ వ్రతం చేసుకునే సమయంలో ఊరిలో ఉన్నటువంటి వారిని కూడాపిలుస్తారు ఇలా పూరి జనం ఈ పూజకు రావటం వల్ల కొత్త కోడలికి ఊరివాళ్లు పరిచయం అయినట్లు అవుతుంది అలాగే ఊరిలోని వాళ్ళు కొత్త కోడలిని చూడటం వల్ల తొందరగా పరిచయాలు ఏర్పడతాయని,ఇలా అందరితో పరిచయం ఏర్పడటం వల్ల కొత్త కోడలికి ఉన్న బెల్కు కాస్త తొలగిపోతుందని భావించి సత్యనారాయణ వ్రతం చేయించి ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులను ఈ వ్రతానికి ఆహ్వానిస్తారు.సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వల్ల నూతన వధూవరుల జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని భావిస్తారు.