కరీంనగర్​లో నెహ్రూ విగ్రహం ఏర్పాటు 

కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి ప్రధాని నెహ్రూ కాంస్య విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం సవరన్ స్ట్రీట్ కూడలి వద్ద ఆయన ఫొటోకు నివాళులర్పించారు.

కాంగ్రెస్ జిల్లా మైనారిటీ, ఎస్టీ సెల్  అధ్యక్షులు ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, ఆర్ష మల్లేశం, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్, కల్యాణి, శ్రీనివాస్, రవీందర్, అశోక్ రావు పాల్గొన్నారు.