వేములవాడ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం.. బురద నీటిలోనే రాజన్న కోడెలు

వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు నిర్లక్యం మరోసారి బయటపడింది.  వర్షాల నేపథ్యంలో రాజన్న గోశాల బురదమయమైంది.  బురద నీటిలోనే రాజన్న కోడెలు ఉన్నాయి.. అందులో నడవాలంటేనే ఇబ్బందిగా మారినా వైనం నెలకొంది.  అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.  గతంలో దేవాదాయ కమిషనర్ ఆలయ గోశాలను పరిశీలించి  హెచ్చరించిన ఆలయ అధికారులు పని తీరు మారలేదు.  వెంటనే బురద నీటిని తొలగించి రాజన్న కోడెలను కాపాడాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు.  

మరోవైపు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.