11వేల మందికి జీరో లేదా అంతకంటే తక్కువ నెగిటివ్ మార్కులు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎగ్జామ్ గందరగోళంగా మారింది. ఈ నీట్ పరీక్ష వ్యవహారం ఎవ్వరికీ అర్థకాకుండా ఉంది. పేపర్ లీక్ అయ్యిందని, కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో ఎక్కువగా ర్యాంకర్లు రావడంతో కొన్ని సెంటర్లపై అనుమానాలు వ్యక్తమైయ్యాయి. దేశవ్యాప్తంగా నీట్ యూజీ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ వంటి పలు సెంటర్లో NTA మళ్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది.

వాటి ఫలితాలు జూలై 20న విడుదల చేసింది. అయితే వారిలో మొత్తం 2 వేల 250 మందికి సున్నా మార్కులు వచ్చాయని, 9 వేల 400 మందికి అంతకంటే తక్కువ నెగిటివ్ మార్కులు వచ్చాయి. ఇప్పటికే నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్  జరిగిందా, ఎక్కడెక్కడ జరిగిందని సీబీఐ విచారణ చేస్తుంది. సుప్రీం కోర్టులో చాలా పిటిషన్లు కూడా నీట్ ఎగ్జామ్ పై వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా అదే అంశం చర్చనీయాంశమైంది.