అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​!

బొటాక్స్​​ను కండరాలకు సంబంధించిన డిజార్డర్స్​, మైగ్రెయిన్స్​, చెమటలను తగ్గించడానికి వైద్యంలో వాడే మెథడ్​. అదే అందం విషయానికి వస్తే ముఖం చర్మం మీద ముడతలు, గీతలు తగ్గించేందుకు వాడుతున్నారు. అందం కోసం బొటాక్స్​ వాడడం అనే విషయం మీద ఇప్పటికీ ఎన్నో వాదనలు నడుస్తూనే ఉన్నాయి​. అయితే ముఖ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు బొటాక్స్​ వరకు పోకుండా ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రెడియెంట్స్​తోనే ట్రై చేయొచ్చు అంటున్నారు కాస్మొటిక్​ ఎక్స్​పర్ట్స్​. వాటివల్ల ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండానే కోరుకున్న రిజల్ట్​ పొందొచ్చు అంటున్నారు కూడా.

నేచురల్​ బొటాక్స్​ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అందుకు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ రెండు పద్ధతులకు కూడా మూడు ఇంగ్రెడియెంట్స్​ చాలు. వీటి తయారీ కూడా చాలా ఈజీ.

మొదటి పద్ధతి 

కావాల్సినవి...

ఒక టేబుల్​ స్పూన్​ కార్న్​ స్టార్చ్( మొక్కజొన్న పిండి)​, ఒక టేబుల్​ స్పూన్​ సోర్​ క్రీమ్​(పుల్లటి మీగడ), ఐదు టేబుల్​ స్పూన్ల క్యారెట్​ జ్యూస్.

సోర్​ క్రీమ్​ తయారీ కోసం... ఒక టేబుల్​ స్పూన్​ నిమ్మ రసాన్ని, రెండు టీస్పూన్ల పెరుగులో వేయాలి. స్పూన్​తో బాగా కలిపితే చిక్కగా అవుతుంది. దాన్ని ఒక గాజు సీసా​లో వేయాలి. టిష్యూ పేపర్​ని మూతలా పెట్టి రబ్బర్​ బ్యాండ్​ లేదా తాడుతో గట్టిగా కట్టాలి. రూమ్​ టెంపరేచర్​లో ఒక రోజంతా ఉంచాలి. తరువాత తాడు విప్పి, మూతగా పెట్టిన టిష్యూ పేపర్​ తీసేయాలి. స్పూన్​తో బాగా కలిపితే చిక్కటి సోర్​ క్రీమ్​ రెడీ. ఫ్రిజ్​లో పెడితే  ఇది పదిరోజులు పాడుకాకుండా ఉంటుంది.

బొటాక్స్​ మాస్క్​ తయారీ

అరగ్లాస్​ నీళ్లలో కార్న్​స్టార్చ్​ వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో పోయాలి. ఇది దాదాపు వంద మిల్లిలీటర్లు అయితే చాలు. సన్నటి మంట మీద ఈ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. చల్లారాక తాజా క్యారెట్​ రసం, సోర్​ క్రీమ్​  వేసి, అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగి, తయారుచేసుకున్న బొటాక్స్​ మాస్క్​ను ముఖం మీద పూసుకోవాలి.

అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్​ లేదా నౌరిషింగ్​ క్రీమ్​ రాసుకోవాలి. ఈ బొటాక్స్​  మాస్క్​ను వరసగా మూడు రోజులు వాడాలి. ఒకసారి వేసుకున్నాక మిగిలిన మాస్క్​ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్​లో పెట్టాలి. మూడు రోజులు నేచురల్​ బొటాక్స్​ ట్రీట్​మెంట్​ పూర్తయ్యాక చర్మం మీద ముడతలు కాస్త తగ్గినట్టు మీకే తెలుస్తుంది. చర్మం హైడ్రేట్​గా ఉంటుంది. స్కిన్​ డల్​నెస్​ తగ్గుతుంది. మృదువుగా అవుతుంది. చర్మం టైట్​ అయినట్టు కూడా గమనించొచ్చు.

మాస్క్​ వేసుకున్నాం సరే బొటాక్స్​లా ఎలా పనిచేస్తుంది అనే అనుమానం రావడం సహజం. ఎందుకు పనిచేస్తుందో అర్థం కావాలంటే ఈ మాస్క్​కు వాడిన పదార్థాల గురించి తెలుసుకోవాలి.

కార్న్​ స్టార్చ్​ అనేది నిర్జీవంగా ఉండే చర్మానికి జీవం పోస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్​ గుణాలు చాలా ఉన్నాయి. కార్న్​స్టార్చ్​ చర్మం మీద ఉండే అధిక జిడ్డును పీల్చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా ముఖం మీద ఒక్కో దగ్గర ఒక్కోలా ఉండే రంగును కూడా సమం చేస్తుంది. అందుకు కారణం ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్​ –ఎ​. ఇందులోని క్యాల్షియం, ఐరన్​లు కొత్త కణాలు తయారుచేస్తాయి.

సోర్​ క్రీమ్​లో చర్మం మీద సానుకూల ప్రభావాన్ని చూపే గుణాలు బోలెడు. అందుకు ప్రధాన కారణం ఇందులోని లాక్టిక్​ యాసిడ్​. ఇది డెడ్​ సెల్స్​ను పోగొడుతుంది. కొల్లాజెన్​ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. లాక్టిక్​ యాసిడ్​లో చర్మం మీద తేమను నిలిపేందుకు సాయం చేసే కంటెంట్​ ఉంది.

క్యారెట్​ జ్యూస్​  ఇది చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఒక్కో విటమిన్​ ఎలా పనిచేస్తుందో చూద్దాం.

విటమిన్​ ఎ : యాక్నె ట్రీట్​మెంట్​కు చాలా బాగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్​ కూడా. ఫ్రీ రాడికల్స్​ ఎక్కువగా ఉత్పత్తి కానీయదు. యాంటీ ఏజింగ్​కి బెస్ట్​ ఆప్షన్​.

విటమిన్​ సి : కొల్లాజెన్​ ప్రొడక్షన్​ పెంచుతుంది. దాంతో చర్మం బిగుతుగా అవుతుంది. అలాగే ముఖం మీద ఉండే మచ్చలను తొలగిస్తుంది. చర్మం ఎర్రగా మారడం, వాపు వంటివి ఉంటే తగ్గిస్తుంది.

విటమిన్​ ఇ : ఈ యాంటీ ఆక్సిడెంట్​ చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. నల్లటి మచ్చలు, గీతలు ఉంటే పోగొడుతుంది.

విటమిన్​ కె : ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్. అచ్చం విటమిన్​–ఎ లాగానే ఫ్రీ రాడికల్​ ఉత్పత్తిని క్రమపరుస్తుంది.

బీటా కెరోటిన్​ : పొడిబారిన లేదా మృత చర్మాన్ని తొలగిస్తుంది. ముఖం మీద తేమను క్రమపరుస్తుంది. చర్మం మీద కొత్త కణాలను తయారుచేసేందుకు బాగా సపోర్ట్​ చేస్తుంది.

పొటాషియం : పొటాషియం అనేది చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.

రెండో పద్ధతి

ఈ పద్ధతిని డాక్టర్​ ఓజ్​ తయారుచేశారు. దీన్ని చాలా స్పీడ్​గా, ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో పైన చెప్పుకున్న పద్ధతిలాగా రిజల్ట్​ వెంటనే కనిపించదు. 

మాస్క్​ తయారీకి కావాల్సినవి – పావు కప్పు పెరుగు, పావు అరటిపండు, ఒక టీ స్పూన్​ తేనె.

తయారీ

అరటిపండును మెత్తగా నలపాలి. అందులో పెరుగు, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకోవాలి. పావుగంటయ్యాక ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగేయాలి. తరువాత ముఖాన్ని తుడిచేటప్పుడు తుండుతో ఎలాగంటే అలా రుద్దకుండా సున్నితంగా మెత్తటి బట్టతో తడిని అద్దాలి. ఆ తరువాత రెగ్యులర్​ స్కిన్​ రొటీన్​ ఫాలో అవ్వడమే.

డాక్టర్​ ఓజ్​ చెప్పిన ఈ అరటి పండు మాస్క్​ తయారీ, వాడకం చాలా తేలిక. చర్మాన్ని రిఫ్రెష్​ చేసేందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ మాస్క్​ వేసుకున్నాక చర్మం చాలా క్లీన్​ అయినట్టు తెలిసిపోతుంది మీకే. స్మెల్​ కూడా బాగుంటుంది. ఈ మాస్క్​ చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా చర్మం మీద ఉంటే ముడతలను కూడా ట్రీట్​ చేస్తుంది.

ఈ మాస్క్​ ఎలా పనిచేస్తుందంటే...

పెరుగులో లాక్టిక్​ యాసిడ్​ ఉంటుంది. ఈ యాసిడ్​ చర్మం మీద మృత కణాలను తొలగించి చర్మాన్ని  మృదువుగా చేస్తుంది. చర్మం మెరుస్తూ, తేమతో, మృదువుగా తయారవుతుంది. అంతేకాదు ముందుముందు చర్మానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. ఇందులో టన్నుల​ కొద్దీ యాంటీ ఏజింగ్​ గుణాలు ఉన్నాయి.

తేనె చర్మానికి తేమను ఇవ్వడమే కాకుండా మంచి క్లెన్సర్​ కూడా. ఇది వాడితే చర్మం మృదువుగా అవుతుంది. మెరుస్తుంది. ముఖం మీద ఉన్న సన్నటి గీతలను,​ ముడతలను పోగొడుతుంది. చర్మం మీది వాపు, ఎరుపుదనం​ తగ్గిస్తుంది.  తేనె వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.

అరటిపండు వాడడం వల్ల చర్మం మీద ఉండే జిడ్డు తగ్గిస్తుంది. చర్మానికి తేమను ఇస్తుంది. యాక్నెకి ఇది మంచి ట్రీట్​మెంట్​. నల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఇది ఆర్గానిక్​ బొటాక్స్ అన్నట్టు. చర్మానికి యాంటీ ఏజింగ్​ ప్రాపర్టీస్​ ఇస్తుంది. 

వీటిలో ఉండే విటమిన్స్​ ఎలా పనిచేస్తాయంటే...

విటమిన్​ ఎ : విటమిన్​ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. డ్యామేజ్​ అయితే సరిచేస్తుంది. గీతలు, మచ్చలు తగ్గిస్తుంది.

విటమిన్​ బి : అరటిపండులో ఉండే బి – విటమిన్స్​ స్ట్రెస్​ తగ్గించి ఫ్రీ రాడికల్​ ఉత్పత్తిని ఆపేస్తుంది.

విటమిన్​ సి : కొల్లాజెన్​ ఉత్పత్తిలో ఇది కీలకం. ఈ విటమిన్​ చర్మం మీద జిడ్డును అదుపుచేస్తుంది. ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్​ను తగ్గిస్తుంది.

విటమిన్​ ఇ :  చర్మం ఏజింగ్​ను నెమ్మదింపచేస్తుంది. ఫ్రీ రాడికల్స్​ ఏర్పడనీయదు. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

అమైనో యాసిడ్స్​ : కనెక్టివ్​ టిష్యూస్​ను బూస్ట్​ చేస్తాయి. చర్మానికి ఎలాస్టిసిటీని ఇస్తుంది.  అయినప్పటికీ చర్మాన్ని స్ట్రాంగ్​గా ఉంచుతుంది.

లెక్టిన్​ : చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అందుకే ముఖం మీద మొటిమలు ఏర్పడవు.
పొటాషియం : అరటిపండులో ఉండే ముఖ్యమైన పోషకం పొటాషియం. ఇది చర్మానికి తేమను ఇస్తుంది.

జింక్​ : ఈ మినరల్​ యాక్నె రాకుండా అడ్డుకుంటుంది. క్రిములతో పోట్లాడుతుంది. దాంతో ముఖ చర్మం శుభ్రంగా, స్పష్టంగా ఉంటుంది.

స్కిన్​ ఏజింగ్​ అనేది చాలా సాధారణ విషయం. దాన్ని ఆపేందుకు ముఖం నిండా బొటాక్స్​ నింపుకోవడం వల్ల కోరుకున్న ఫలితం రాకపోవచ్చు. చాలామంది బొటాక్స్​ లేదా సర్జరీలు చివరి ఆప్షన్​ అనుకుంటారు. కానీ స్కిన్​కి యంగ్ లుక్​ ఇచ్చేందుకు సింపుల్​ పద్ధతులు ఉన్నాయి.
చర్మ సంరక్షణ అనేది పైపై మెరుగులతో జరిగేది కాదు. అందుకు శరీరం, బుర్ర​, ఆరోగ్యం అనేవి సరిగా ఉండాలి. అప్పుడే వయసు ప్రభావం చర్మం మీద కనిపించదు. అందుకని రిస్కీ ప్రత్యామ్నాయ మార్గాలకు బదులు ఇంట్లో ఉండే మూడే మూడు ఇంగ్రెడియెంట్స్​తో నేచురల్​ బొటాక్స్​ ఎలా తయారుచేయాలో తెలుసుకున్నారు కదా! కొంచెం టైం, మరికొంచెం ఓపిక ఉంటే చాలు... ఈ పద్ధతులు వాడితే చర్మానికి  నిగారింపు తేవచ్చు.

చియా గింజలతో...

మెరిసే చర్మానికి...​

కావాల్సినవి : రెండు టేబుల్​ స్పూన్ల చియా గింజలు, నాలుగు టేబుల్​ స్పూన్ల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్​ తేనె

తయారీ : చియా గింజల్ని నీళ్లలో వేసి ఒక గంట లేదా అవి జెల్​ లాగా మారేవరకు నానబెట్టాలి. వాటిని బ్లెండర్​లో వేసి గ్రైండ్​ చేయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్​ తేనె కలపాలి. ముఖం శుభ్రంగా కడిగి మాస్క్​ను ముఖానికి రాసుకోవాలి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి.

 తేమకోసం...

కావాల్సినవి : రెండు టేబుల్​ స్పూన్ల చియా గింజలు, రెండు టేబుల్​ స్పూన్ల అలోవెరా జెల్​(కలబంద గుజ్జు). కావాలనుకుంటే ఆలివ్​ లేదా ఆల్మండ్​ ఆయిల్​ వాడొచ్చు.

తయారీ : చియా గింజలను నీళ్లలో అరగంట నానబెట్టాలి. అవి జెల్​లా అవుతాయి. తరువాత ఆ జెల్​ని ఒక గిన్నెలో వడకట్టాలి. అందులో అలోవెరా జెల్​ కలపాలి. కావాలనుకుంటే కొన్ని చుక్కల ఆలివ్​ నూనె లేదా బాదం నూనె కలుపుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన ముఖం, మెడకు వేసుకోవాలి. పావుగంట తరువాత శుభ్రంగా కడిగేయాలి. చియా గింజలతో తయారుచేసిన ఈ ఫేస్​ మాస్క్​ల వల్ల లాభాలు బోలెడు. చియా గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ మెండుగా ఉంటాయి. వాటివల్ల చర్మానికి పోషకాలు అందుతాయి. దానివల్ల చర్మం సహజం​గా నూనె ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల చర్మం తేమ కోల్పోదు. వాపు, మంట వంటివి ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే హెల్దీ స్కిన్​ సొంతం అవుతుంది. అలాగే సాధారణ చర్మ సమస్యలు రాకుండా నివారిస్తుంది. చియా గింజల్లో విటమిన్​ ఎఫ్​ ఉంటుంది. అది చర్మ ఆరోగ్యానికి, మెరుపుకి కారణం అవుతుంది.

సహజమైన ఈ పద్ధతులు వాడితే చర్మానికి పోషణ అందివ్వడమే కాకుండా స్కిన్​ ఏజింగ్​గురించి కూడా పోరాడతాయి. అదికూడా ఎటువంటి రిస్క్​ లేకుండా!