కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా 16న దేశవ్యాప్త సమ్మె

ఆర్మూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 16న జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొనాలని ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ పిలుపునిచ్చారు. శనివారం ఆర్మూర్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్ బిల్లును​ వాపస్ తీసుకోవాలని, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని

కుటీర పరిశ్రమలను కాపాడాలని, ఉపాధి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టకూడదన్నారు. 2016లో సుప్రీంకోర్డు తీర్పు చెప్పిన ప్రకారం సపాయి కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నారు. జీపీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎండీ ఖాజా మొయినుద్దీన్, లీడర్లు వి.బాలయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు.