తెలంగాణలో రికార్డు స్థాయిలో బీజేపీ సభ్యత్వ నమోదు : మధుసూదన్ రెడ్డి

  •     జాతీయ కార్యవర్గ సభ్యుడు మధుసూదన్ రెడ్డి 

నకిరేకల్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నకిరేకల్ మెయిన్ సెంటర్​లో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు సభ్యత్వం నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా తెలంగాణలో భారీగా సభ్యత్వం నమోదు కావడం ఒక రికార్డు సృష్టించిందన్నారు. 

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిలర్ నంబర్ శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మండల వెంకన్న, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు సాయన్న, నవీన్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జానీ, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సైదులు, జిల్లా నాయకులు గర్ర మురళి, మోహన్, చౌగొని నాగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.