చంద్రునిపై గుహ ఫొటోలను రిలీజ్ చేసిన నాసా

చంద్రునిపై మానవ నివాసానికి యోగ్యమైన ప్రాంతాలను అన్వేషిస్తున్న సమయంలో సైంటిస్టులకు పెద్ద గొయ్యి కనిపించింది. నాసా విభగమైన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) మూన్ పై కనుగొన్న గుహ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ గుహ లోతు 200 మీటర్లు ఉంది. ఇది అపోలో 11 ల్యాండింగ్ సైట్ కు ఈశాన్యానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ALSO READ | భూమిపైన ఉన్నట్లుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్​ నావిగేషన్​ వ్యవస్థ

అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం 2010లో ప్రవేశపెట్టిన LROలోని మినీ RF పరికరం ద్వారా సేకరించిన రాడార్ డేటాను విశ్లేషిస్తూ, మేరే ట్రాంక్విల్లిటాటిస్‌లో ఓ గుహ ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ గొయ్యి అపోలో 11 ల్యాండింగ్ సైట్‌కు ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మంచుకొండ అంచు కావచ్చని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నాసా మొదటి సారి గుహ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేసింది.