తండాలో ఇంటింటికీ భగవద్గీత పంపిణీ

లింగంపేట, వెలుగు: మండలంలోని ముంబాజీపేట తండాకు చెందిన నరేశ్ నాయక్​ అనే  యువకుడు  తండాలోని 40 కుటుంబాలకు మంగళవారం భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేశ్ నాయక్ మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచించారు.

హిందూ ధర్మ గ్రంథమైన భగవద్గీతను అందరూ అభ్యసించాలని కోరారు. యువతీ యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ, ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడుచుకుంటే దేశానికి మేలు చేసిన వారవుతారన్నారు. ఆయన వెంట సంపత్​ తండాకు చెందిన యువకులు ఉన్నారు.