గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటా

  • ఆల్ఫోర్స్  విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి

జగిత్యాల రూరల్ వెలుగు: రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..  అన్ని పొలిటికల్ పార్టీలతో ఇంతకాలం న్యూట్రల్  గా ఉన్నానని, ప్రస్తుతానికి తాను ఏ పార్టీ లో లేనన్నారు. త్వరలోనే ఏ పార్టీలో చేరుతాననే విషయంలో స్పష్టత ఇస్తానన్నారు.

అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా మండలిలో తన వాయిస్ వినిపిస్తానన్నారు. విద్యావేత్తగా తనకు మూడు తరాలతో సంబంధాలు ఉన్నాయన్నారు. విద్య వ్యవస్థలో కేజీ టు పీజీ వరకు తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని తెలిపారు. చిన్నగా ట్యూషన్స్ తో మొదలైన 34 ఏళ్ల ప్రస్థానంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను స్థాపించి సక్సెస్ అయ్యానని నేడు ఉత్తర తెలంగాణకే ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు గర్వకారణంగా ఉన్నాయన్నారు. రాజకీయం లోకి వచ్చినా కూడా విద్యా వ్యవస్థను వదిలేది లేదన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే విషయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో చర్చించానని పేర్కొన్నారు.