నందికొండ చైర్‌‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ (నందికొండ) చైర్ పర్సన్ కర్ణ అనుష రెడ్డి, వైస్ చైర్మన్‌ మంద రఘువీర్‌‌(బిన్నీ)పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.  గురువారం మున్సిపాలిటీలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌‌, మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య అవిశ్వాసం మీటింగ్‌ పెట్టారు.  

మున్సిపాలిటీలో 11 మంది సభ్యులు ఉండగా చైర్‌‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌  మినహా మిగితా 9 మంది సభ్యులు హాజరయ్యారు. 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ అవిశ్వాసం ప్రతిపాదించగా మిగతా ఎనిమిది మంది సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో  చైర్‌పర్సన్‌ కర్ణ అనూష, వైస్ చైర్మన్  బిన్నీ తమ పదవులను కోల్పోయారు.

Also read : వైభవంగా రథసప్తమి వేడుకలు.. ఏడు వాహనాలపై విహరించిన సూర్య నారాయణుడు