ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో సీఐ ఎఫైర్ ..ఏం జరిగిందంటే.?

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నల్గొండ టూ టౌన్ సీఐ డానియల్ పై ఫిర్యాదు చేశాడు ఓ  భర్త. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన  తన భార్య ను ట్రాప్ చేసి ..వివాహేతర  సంబంధం కొనసాగిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

తన భార్యతో  కాపురం చేయకుండా టూ టౌన్  సీఐ పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేయించాడని ఆరోపించాడు మహిళ భర్త ప్రశాంత్ రెడ్డి.  సీఐ, తన భార్యతో చేసిన వాట్సప్ చాట్ ను   బయటపెట్టాడు  ప్రశాంత్ రెడ్డి.  దీంతో   అంతర్గత విచారణకు ఆదేశించారు  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సీఐ  డానియల్ తో తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో తెలిపాడు ప్రశాంత్ రెడ్డి.