నెలాఖరులోపు దరఖాస్తుల పరిశీలన: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,31,831 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తులన్నీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ద్వారా అధికారులు పరిశీలించాలని సూచించారు. 

ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్టార్ట్..

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల నేతృత్వంలో పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తుండగా, మున్సిపాలిటీల్లో స్టాఫ్​నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్​చేసుకున్న వారి వద్దకు వెళ్లి ఇంటి స్థల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు. 

ఇంటి స్థలం ధ్రువీకరణ కోసం జియో టాగింగ్ ద్వారా ఫొటో తీసుకొని మొబైల్​ యాప్​లో అప్​లోడ్​చేస్తున్నారు. సర్వే కోసం వచ్చే స్టాఫ్​కు ప్రజలు సహకరించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. సర్వేకు సంబంధించిన అనుమానాలు ఉంటే కలెక్టరేట్​లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08685-293312 ను సంప్రదించాలని సూచించారు. Indiramma Indla, Collector Ila Tripathi, Nalgonda, Application Scrutiny,  Indiramma Indla