Moonsoon Tour : ఈ కాలంలో నల్లమలకి అలా వెళ్లి వస్తే ఆ ఆనందమే వేరు..!

నల్లమల అంటేనే అడవులకు పుట్టినిల్లు, నల్లమల కొండలు, అడవులు ఆధ్యాత్మిక క్షేత్రాలకే కాదు... పర్యాటక ప్రాంతం కూడా. నల్లమల హిల్స్ ఎన్నో అద్భుతాలకు నిలయం. వర్షాకాలంలో నల్లమలను సందర్శిస్తే ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఎన్నో అందమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాలు మంత్రముగ్ధులను చేస్తాయి. 

ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్, హైకింగ్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు. వీకెండ్లో విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం. ఇండియాలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ప్రాంతం ఇక్కడ ఉంది. సుమారు 3,568 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చుట్టిరావడం అంటే కచ్చితంగా సాహసం చేయడమే. శాంచురి లోపల ఎన్నో రకాల వృక్షాలు, వెదురు మొక్కలు వంటివి. 

చూడొచ్చు. వివిధ రకాల జంతువులను అంటే పులులు, చిరుతలు, హైనాలు, అడవి . పిల్లులు, ఎలుగులు, లేళ్ళు, దుప్పులు వంటివి చూడొచ్చు. శ్రీశైలం సమీపాన నీటి మడుగులో వివిధ రకాల మొసళ్లు ఉంటాయి..