అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : నాగుల సత్యనారాయణ గౌడ్

సిరిసిల్ల టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి ఓర్వలేకనే మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌‌‌‌ను విమర్శిస్తున్నారని రాజన్నసిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ ద్వారా ప్రత్యేక తెలంగాణ సాకారం అయితే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సాధించారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

మంగళవారం సిరిసిల్లలో జరిగిన మీటింగ్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ నేతన్నలకు ఇవ్వాల్సిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.  ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్లను బెదిరిస్తూ కేటీఆర్ దిగజారి మాట్లాడడం దారుణమన్నారు. 

 సీఎంను అంటే ఊరుకునేది లేదు 

కరీంనగర్ సిటీ, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌రావు హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంపై పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తామన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పెద్దలు తెలంగాణ ఉద్యమ టైంలో వందలాది మంది అమాయకులను రెచ్చగొట్టి పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు.

‘ ఎంపీ ఎన్నికల్లో నేను డమ్మీ క్యాండిడేట్ అయితే, నీ డైనమైట్ క్యాండిడేట్ బి.వినోద్ కుమార్ మూడో స్థానంలో ఎందుకు నిలిచాడు’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను పోటీచేయించి గెలిపించాలని సవాల్‌‌‌‌ చేశారు.

పదేండ్ల పాపాలను కడుగుతున్నాం

ఎల్లారెడ్డిపేట, వెలుగు: గత ప్రభుత్వ పదేండ్లలో చేసిన పాపాలను కడుగుతున్నామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట పార్టీ ఆఫీస్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంగళవారం సిరిసిల్లలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో మాజీ మంత్రి కేటీఆర్.. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను బెదిరిస్తూ మాట్లాడడం సరికాదన్నారు.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. నాటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో కాళ్లు మొక్కించుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, లీడర్లు రాంరెడ్డి, గిరిధర్ రెడ్డి, చెన్ని బాబు, కిషన్, రాజేందర్, సంతోష్ గౌడ్, వెంకటేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.