అయోధ్య రామయ్య మీద భక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తున్నారు. కాశీలో రామ భక్తులు రాముడి బొమ్మని పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. టాటూ ఔట్‌లెట్ యజమాని అశోక్ గోగియా ఈ విషయం గురించి చెప్తూ ‘‘మా షాప్‌కు రోజుకు సగటున10–15 మంది రాముడి పేరు, బొమ్మని టాటూ వేయించుకునేందుకు వస్తున్నారు” అన్నాడు. ఈ టాటూ ట్రెండ్ కాశీలోనే కాదు.. మహారాష్ట్రలో కూడా మొదలైంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన హృతిక్ రాజేంద్ర దారొడే అనే టాటూ ఆర్టిస్ట్ 1,001 మందికి ఉచితంగా టాటూలు వేయాలని నిర్ణయించుకున్నాడు. రాముడి రూపాలను భక్తుల చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో టాటూకు హృతిక్ దారొడేకు350 రూపాయలు ఖర్చవుతుంది. అలా వెయ్యిమందికి టాటూ వేయాలంటే సుమారు 3.5 లక్షలు ఖర్చు అన్నట్టు.